టామ్‌ అండ్‌ జెర్రీలో పుష్ప సన్నివేశాలు. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. వీడియో

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన పుష్ప చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఒక్కసారిగా జాతీయ సినిమాను షేక్‌ చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Phani CH

|

Mar 03, 2022 | 8:53 AM

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన పుష్ప చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఒక్కసారిగా జాతీయ సినిమాను షేక్‌ చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా విడుదలై మూడు నెలలు గడుస్తోన్నా నార్త్‌ నుంచి సౌత్‌ వరకు ఇప్పటికీ ఈ సినిమా తాలుకు బజ్‌ కొనసాగుతూనే ఉంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న మీమర్స్‌ కూడా పుష్పను తమ క్రియేటివీ ప్రదర్శించుకోవడానికి సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా పుష్ప సినిమాలోని సన్నివేశాలను, టామ్‌ అండ్‌ జెర్రీ కామిక్‌ సిరీస్‌కు లింక్‌ చేసి రూపొందించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రష్మిక ‘సామి సామి’ స్టెప్‌ నుంచి అల్లు అర్జున్‌ ‘తగ్గేదేలే’ మేనరిజం వరకు అన్ని సన్నివేశాలను టామ్‌ అండ్‌ జెర్రీ వీడియోలకు సింక్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వారి క్రియేటివిటీకి హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. మరి ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu