AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కుక్కకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన తోటి శునకాలు.. నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోన్న వీడియో..

శునకాలను విశ్వాసం, నమ్మకానికి ప్రతిరూపాలుగా భావిస్తుంటారు చాలామంది. అందుకే వాటిని తమ ఇంట్లోని సొంత సభ్యుల్లా ప్రేమతో చూసుకుంటారు. ఒక్కక్షణం అవి కనపడకపోతే అల్లాడిపోతుంటారు.

Viral Video: కుక్కకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన తోటి శునకాలు.. నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోన్న వీడియో..
Basha Shek
|

Updated on: Mar 02, 2022 | 8:30 PM

Share

శునకాలను విశ్వాసం, నమ్మకానికి ప్రతిరూపాలుగా భావిస్తుంటారు చాలామంది. అందుకే వాటిని తమ ఇంట్లోని సొంత సభ్యుల్లా ప్రేమతో చూసుకుంటారు. ఒక్కక్షణం అవి కనపడకపోతే అల్లాడిపోతుంటారు. ఇక ఆ మూగజీవాలు చనిపోయినప్పుడు వాటి యజమానులు పడే ఆవేదన అంతా ఇంతాకాదు. కొద్దిమంది కుక్కలకు కూడా మనుషుల వలే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఏపీలోని ఓ జిల్లాలో చనిపోయిన కుక్కను ఫ్రీజర్‌ బాక్స్ లో ఉంచి ఘనంగా అంత్యక్రియలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ అచ్చం మనుషల్లానే ఓ చనిపోయిన కుక్కకు తోటి శునకాలు అంతిమ సంస్కారాలు నిర్వహించాయి . ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోను చూసిన ప్రతిఒక్కరు చలించిపోతున్నారు.

కుక్కలకూ ఎమోషన్లు ఉంటాయి..

వీడియోలో ఏముందంటే.. శునకం చనిపోవడంతో తోటి కుక్కలు దహన సంస్కారాలు చేశాయి. దాదాపుగా 10 కుక్కలు తమ కాళ్లతో ముందుగా ఓ గొయ్యి తవ్వాయి. అనంతరం చనిపోయిన కుక్కను ఆ గొయ్యిలో పడేసి.. తమ మూతితో మట్టిని దానిపై వేశాయి. కుక్కను పూడ్చడం కోసం కుక్కలు చాలా సమయం కష్టపడ్డాయి. హృదయాన్ని హత్తుకునే ఈ వీడియోను ప్రముఖ ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఇవి జంతువులా’ అని ఈ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. సుమారు 45 సెకన్ల నిడివి గల ఈ వీడియో ప్రతి ఒక్కరి కంట కన్నీరు తెప్పిస్తోంది. ‘చనిపోయిన కుక్కను ఇతర శునకాలు పాతిపెడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధేస్తోంది, మనుషుల కంటే జంతువులు చాలా సున్నితంగా ఉంటాయి. మూగజీవాలకు భావోద్వేగాలు ఉంటాయి’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి నెటిజన్ల మనసులను హత్తుకుంటోన్న ఈ వైరల్‌ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also read:Minister Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను హత్య చేసేందుకు ప్లాన్.. కుట్రను భగ్నం చేసిన పోలీసులు..

ET Trailer: ‘పంచె కడితే నేనే రా జడ్జి’.. యాక్షన్‌ థ్రిల్లర్‌గా సూర్య ఈటీ ట్రైలర్‌.. రాక్‌సాలిడ్‌గా ఉందన్న టాలీవుడ్‌ రౌడీ..

Yami Gautam: ఆమె మనసూ అందమైనదే.. ఫెయిర్‌ అండ్ లవ్లీ బ్యూటీపై ప్రశంసలు కురిపిస్తోన్న ఫ్యాన్స్‌.. కారణమేంటంటే..