ET Trailer: ‘పంచె కడితే నేనే రా జడ్జి’.. యాక్షన్ థ్రిల్లర్‌గా సూర్య ఈటీ ట్రైలర్.. రాక్‌సాలిడ్‌గా ఉందన్న టాలీవుడ్ రౌడీ..
కోలీవుడ్ స్టార్ హీరోసూర్య (Suriya)కు తెలుగులోనూ ఎంతో క్రేజ్ ఉంది. ఆయన నటించిన డబ్బింగ్ సినిమాలు ఇక్కడ కూడా భారీ విజయాలు సొంతం చేసుకుంటున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరోసూర్య (Suriya)కు తెలుగులోనూ ఎంతో క్రేజ్ ఉంది. ఆయన నటించిన డబ్బింగ్ సినిమాలు ఇక్కడ కూడా భారీ విజయాలు సొంతం చేసుకుంటున్నాయి. ప్రారంభంలో ఎక్కువగా మాస్ పాత్రలు, యాక్షన్ రోల్స్‌తో ఆకట్టుకున్న ఈ హీరో ఇప్పుడు వైవిధ్యమైన రోల్స్‌లో అదరగొడుతున్నాడు. ‘జై భీమ్’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సూర్య ఇప్పుడు ఈటీ’ (ఎతర్‌క్కుమ్ తునిందవన్) (Etharkkum Thunindhavan)’ చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. తెలుగులో ఈటీ అంటే ‘ఎవరికీ తలవంచకు’ అని అర్థం. మాస్ యాక్షన్థ్రిల్లర్గా వస్తోన్న ఈ సినిమాలో మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకృత్యాలు, దారుణాలను ఎండగట్టే ప్రయత్నం చేయనున్నాడు సూర్య. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పాండిరాజ్‌దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది.
కోటు వేసుకునే జడ్డి వేరే.. కాగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈటీ చిత్రం మార్చి 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ‘నాకు ఇష్టమైన నటుల్లో ఒకరైన సూర్య అన్న నటించిన ఈటీ ట్రైలర్ రాక్ సాలిడ్ గా ఉంది. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్’ అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు విజయ్. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ‘సంతోషంలో గొప్ప సంతోషం ఏమిటంటే..ఇతరులను సంతోష పెట్టడమే’, ‘కోటు వేసుకునే జడ్జి వేరే..పంచె కడితే నేనే రా జడ్జిని’ అంటూ సూర్య పలికే డైలాగ్ లు ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సూర్యనే స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. సూర్య గత చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఈక్రమంలో థియేటర్లలో విడుదల కానున్న ఈటీ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో సీనియర్ నటుడు సత్యరాజ్, జయప్రకాశ్, వినయ్‌రామ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. డి.ఇమ్మాన్ స్వరాలందిస్తున్నారు.
Taking absolute pleasure in launching the #ETTeluguTrailer 🙂https://t.co/INegr2HKsG
This Looks Rock Solid! My Best wishes to one of my favourites, dearest @Suriya_offl anna? & the team of #EvarikiThalaVanchadu❤️@priyankaamohan @pandiraj_dir @AsianCinemas_ @sunpictures #ET
— Vijay Deverakonda (@TheDeverakonda) March 2, 2022
Also Read:Janasena-TDP: భీమ్లా నాయక్‌కు టీడీపీ సపోర్ట్ వెనుక ఆంతర్యం అదేనా.. ఆసక్తికర కథనం మీకోసం..!