AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pathan: ఎట్టకేలకు ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించిన బాలీవుడ్ బాద్‌షా.. పఠాన్ రిలీజ్‌ డేట్‌ను చెప్పేసిన షారుఖ్‌..

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ చివరిగా 'జీరో' చిత్రంలో నటించాడు.  2018 చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం షారుఖ్‌ తో పాటు అతని ఫ్యాన్స్‌కు నిరాశే మిగిల్చింది.

Pathan: ఎట్టకేలకు ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించిన బాలీవుడ్ బాద్‌షా.. పఠాన్ రిలీజ్‌ డేట్‌ను చెప్పేసిన షారుఖ్‌..
Shah Rukh Khan
Basha Shek
|

Updated on: Mar 02, 2022 | 6:24 PM

Share

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ చివరిగా ‘జీరో’ చిత్రంలో నటించాడు.  2018 చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం షారుఖ్‌ తో పాటు అతని ఫ్యాన్స్‌కు నిరాశే మిగిల్చింది. ఈ సినిమా పరాజయం తర్వాత చాలాకాలం పాటు విరామం తీసుకున్నాడీ సూపర్‌స్టార్‌. అభిమానులు కూడా తమ హీరో సినిమా కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ నిరీక్షణకు తెరదించాడు షారుఖ్‌ (Shah Rukh Khan). ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉన్న తన చిత్రం ‘పఠాన్‌’ను వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించాడు . ఈ సందర్భంగా సినిమా టీజర్‌ను షేర్ చేస్తూ ‘ ఆలస్యమైందని నాక్కూడా తెలుసు. కానీ పఠాన్‌ టైమ్ ఇప్పుడే మొదలైంది. 2023 జనవరి 25న బిగ్‌ స్క్రీన్‌పై అందరమూ కలుసుకుందాం’ అని తెలిపాడు.

పొడవాటి జుట్టుతో మరింత స్టైలిష్‌ గా..

ఇక టీజర్‌ విషయానికి వస్తే ‘జాన్‌ అబ్రహం, దీపికా పదుకొనెల పాత్రలను పరిచయం చేస్తూ షారుఖ్‌ వాయిస్‌తో టీజర్‌ ప్రారంభమవుతుంది. అయితే టీజర్‌ చివరిలో లాంగ్‌ హెయిర్‌, స్టైలిష్‌ లుక్‌లో షారుఖ్‌ ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. కాగా సుమారు మూడేళ్ల గ్యాప్‌ తర్వాత స్క్రీన్‌పై షారుఖ్‌ను చూడడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గతంలో బ్యాంగ్‌ బ్యాంగ్‌, వార్‌ లాంటి యాక్షన్‌ ఎంటర్‌టైనర్లను తెరకెక్కించి హిట్‌ కొట్టిన సిద్ధార్థ్‌ ఆనంద్‌ ‘పఠాన్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్ఠాత్మక యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌లో 50వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. షారుఖ్‌ స్నేహితుడు సల్మాన్ ఖాన్ కూడా ఈసినిమాలో అతిథి పాత్రలో మెరవనున్నాడు.

Also Read:Virata Parvam: త్వరలోనే ప్రేక్షకుల ముందుకు విరాటపర్వం.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన దగ్గుబాటి రానా..

Vaishnav Tej: ముచ్చటగా మూడో సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేసిన మెగా హీరో.. రంగరంగ వైభవంగా రిలీజ్‌ ఎప్పుడంటే..

తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. వారు ఉచితంగానే బస్సుల్లో ప్రయాణించవచ్చు