Virata Parvam: త్వరలోనే ప్రేక్షకుల ముందుకు విరాటపర్వం.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన దగ్గుబాటి రానా..
బాహుబలి సిరీస్ తర్వాత మళ్లీ ఆ రేంజ్‌లో హిట్ అందుకోవడానికి దగ్గుబాటి రానా (Rana daggubati) కు చాలా కాలం పట్టింది. ఎట్టకేలకు భీమ్లానాయక్ (Bheemla Nayak) రూపంలో ఆ కొరత తీర్చుకున్నాడు.
బాహుబలి సిరీస్ తర్వాత మళ్లీ ఆ రేంజ్‌లో హిట్ అందుకోవడానికి దగ్గుబాటి రానా (Rana daggubati) కు చాలా కాలం పట్టింది. ఎట్టకేలకు భీమ్లానాయక్ (Bheemla Nayak) రూపంలో ఆ కొరత తీర్చుకున్నాడు. ఇందులో పవన్‌కు ధీటుగా డానియల్ శేఖర్‌గా అదరగొట్టాడు రానా. ఈక్రమంలో తన జోరును అలాగే కొనసాగించాలనుకుంటున్నాడీ దగ్గుబాటి హీరో. ఇందులో భాగంగా తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాడు. కాగా రానా, సాయిపల్లవి కాంబినేషన్ లో రూపొందుతోన్న విరాట పర్వం (Virata Parvam) ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటోంది. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియమణి, జరీనా వహాబ్, నవీన్ చంద్ర, సాయిచంద్, నందితాదాస్, బెనర్జీ, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ‘నీది నాది ఒకే కథ’ ఫేం వేణు ఊడుగల దర్శకత్వం వహిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ నటించిన ‘దృశ్యం -2’, ‘నారప్ప’ చిత్రాలు ఓటీటీలో విడుదలైన నేపథ్యంలో ‘విరాటపర్వం’ కూడా డిజిటల్ తెరపైకి వస్తుందనే ప్రచారం ఆ మధ్యన బాగా సాగింది. తాజాగా రానా ఈ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు.
ప్రస్తుతం ‘భీమ్లానాయక్’ విజయోత్సాహంలో ఉన్న రానా విరాట పర్వాన్ని కూడా వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాట. ‘ఇప్పటికే విరాట పర్వం సినిమా రీ రికార్డింగ్ పూర్తయింది. ఒకటి రెండు రోజుల్లో సినిమా ప్రివ్యూ చూడబోతున్నాను. ఇప్పటికే చాలా సినిమాల విడుదల తేదీలను ప్రకటించిన నేపథ్యంలో ఓ మంచి రిలీజ్ డేట్ ను వెతుక్కుని ‘విరాటపర్వం’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని రానా తెలిపారు. యదార్థ సంఘటనల ఆధారంగా 1990’s నాటి విప్లవ కథగా విరాటపర్వం తెరకెక్కుతోంది. రానా, ప్రియమణి నక్సలైట్లుగా కనిపించనున్నారు. అభ్యుదయ భావాలు కలిగిన యువకుడిగా రానా, అతడి కవితలు చదివి అతడి ప్రేమకోసం వెతుకుతూ వెళ్లి చిక్కుల్లో పడ్డ యువతిగా సాయిపల్లవి కనిపిస్తుంది.