AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yami Gautam: ఆమె మనసూ అందమైనదే.. ఫెయిర్‌ అండ్ లవ్లీ బ్యూటీపై ప్రశంసలు కురిపిస్తోన్న ఫ్యాన్స్‌.. కారణమేంటంటే..

యామీ గౌతమ్‌.. ఫెయిర్ అండ్‌ లవ్లీ ప్రకటనతో అందరి మనసులు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్థిరపడిన ఈ అందాల తార తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

Yami Gautam: ఆమె మనసూ అందమైనదే.. ఫెయిర్‌ అండ్ లవ్లీ బ్యూటీపై ప్రశంసలు కురిపిస్తోన్న ఫ్యాన్స్‌.. కారణమేంటంటే..
Yami Gautam
Basha Shek
|

Updated on: Mar 02, 2022 | 7:28 PM

Share

యామీ గౌతమ్‌.. ఫెయిర్ అండ్‌ లవ్లీ ప్రకటనతో అందరి మనసులు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్థిరపడిన ఈ అందాల తార తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నితిన్‌ సరసన కొరియర్‌ బాయ్‌ కల్యాణ్‌, అల్లు శిరీశ్‌ సరసన గౌరవం, నువ్విలా చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించిందీ అందాల తార. ఆతర్వాత హిందీ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి వరుస విజయాలు సాధించింది. బద్లాపూర్‌, సనమ్‌ రే, కాబిల్‌, సర్కార్‌ 3, ఉరి, బాలా, గిన్ని వెడ్స్‌ సన్నీ, భూత్‌ పోలీస్‌ తదితర హిట్‌ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే యామీ గౌతమ్ (Yami Gautam) తాజాగా ఏ థర్స్​డే అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంలో అత్యాచార బాధితురాలి పాత్రలో యామీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

కాగా రీల్‌ లైఫ్‌ లో అత్యాచార బాధితులిగా నటించిన యామీ ఇప్పుడు రియల్‌ లైఫ్‌లో లైంగిక వేధింపుల బాధితులకు అండగా నిలిచేందుకు నడుం బిగించింది. వారికి పునరావాసం కల్పించడం కోసం మజ్లిస్​, పారి ( పీపుల్​ ఎగైనెస్ట్ రేప్​ ఇన్​ ఇండియా) అనే రెండు స్వచ్ఛంద సంస్థలతో చేతులు కలిపింది. ‘లైంగిక వేధింపుల బాధితుల పునరావాసానికి కృషి చేస్తున్న రెండు ఎన్‌జీవో‌లతో చేతులు కలిపినందుకు చాలా గర్వంగా ఉంది. మహిళల భద్రత సమస్యల విషయంలో కొంత పురోగతి సాధించినప్పటికీ చేయాల్సింది మాత్రం చాలా ఉంది. స్వచ్ఛంద సంస్థలతో నా అనుబంధం ఇప్పుడే ప్రారంభమైంది. అయితే భవిష్యత్తులో.. అన్ని వర్గాల మహిళలను రక్షించడానికి అవసరమైన వసతుల కల్పనకు మరింత సహకారం అందించాలనుకుంటున్నాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది యామీ. కాగా లైంగిక వేధింపుల బాధితుల కోసం నడుంబిగించిన యామీపై ఆమె అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె లాగే ఆమె మనసూ అందమైనదంటూ కొనియాడుతున్నారు.

Also Read: Good News: హైదరాబాద్‌లోని ఆ ప్రాంత వాసులకు శుభవార్త.. ఇకపై వారికి కూడా ఉచితమే..

‘నాన్నా.. లే నాన్నా.. లే’.. తండ్రి మృతదేహం వద్ద ఆరేళ్ల కూతురి ఆక్రందన.. కంటతడి పెట్టించిన ప్రమాదం

Vaishnav Tej: ముచ్చటగా మూడో సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేసిన మెగా హీరో.. రంగరంగ వైభవంగా రిలీజ్‌ ఎప్పుడంటే..