Vaishnav Tej: ముచ్చటగా మూడో సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేసిన మెగా హీరో.. రంగరంగ వైభవంగా రిలీజ్‌ ఎప్పుడంటే..

మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav tej) మొదటి మూవీతోనే వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయాడు. ఉప్పెన (Uppena) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మెగా హీరో.. బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు.

Vaishnav Tej: ముచ్చటగా మూడో సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేసిన మెగా హీరో.. రంగరంగ వైభవంగా రిలీజ్‌ ఎప్పుడంటే..
Ranga Ranga Vaibhavanga
Follow us
Basha Shek

|

Updated on: Mar 02, 2022 | 5:49 PM

మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav tej) మొదటి మూవీతోనే వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయాడు. ఉప్పెన (Uppena) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మెగా హీరో.. బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఆతర్వాత క్రిష్‌ దర్శకత్వంలో చేసిన కొండపొలంతో కమర్షియల్‌ హిట్‌ అందుకోలేకపోయినా నటన పరంగా మరో మెట్టు పైకెక్కాడు. ఇక ఈ హీరో ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమానూ కూడా పూర్తి చేశాడు. అదే రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga). వైష్ణవ్‌ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్‏గా నటిస్తోంది. విక్రమ్‌ తనయుడు ధ్రువ్ విక్రమ్ తో ‘ఆదిత్యవర్మ’ (అర్జున్‌ రెడ్డి తమిళ రీమేక్‌) తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్న గిరీశయ్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. వీటిని చూస్తోంటే కాలేజీ లవ్‌ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యంలో యువతను ఆకట్టుకునేలా సినిమాను రూపొందించారని చెప్పవచ్చు.

మిమ్మల్ని ప్రేమలో పడేసేందుకు.. కాగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన రంగ రంగ వైభవంగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘షూటింగ్ పూర్తైంది. మిమ్మల్ని ప్రేమలో పడేసేందుకు త్వరలో మీ ముందుకొస్తున్నాం’ అంటూ మూవీ యూనిట్‌ ట్వీట్ చేసింది. ఈ సినిమాకు రాక్‌స్టార్‌ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సీనియర్‌ ప్రొడ్యూసర్‌ బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని మే 27 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు గతంలో దర్శక నిర్మాతలు ప్రకటించారు.

Also Read:Viral: ఓరీ దేవుడో ఇదేం మొక్కుబడిరా బాబు..నెత్తిమీదే మంట పెట్టి.. పొంగల్‌ వండేస్తున్నారు..!

Shriya Saran: ఆస్పత్రిలో శ్రియా భర్త.. కూతురును కూడా ఎత్తుకోలేకపోయాడంటూ ఎమోషనల్‌.. ఇంతకీ ఆండ్రీకి ఏమైందంటే..

Fact Check: సల్మాన్ ఖాన్ – సోనాక్షి సిన్హా పెళ్లి ఫోటో కలకలం

వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?