Janasena-TDP: భీమ్లా నాయక్‌కు టీడీపీ సపోర్ట్ వెనుక ఆంతర్యం అదేనా.. ఆసక్తికర కథనం మీకోసం..!

Janasena-TDP: భీమ్లా నాయక్‌కు టీడీపీ సపోర్ట్ ఫ్యూచర్ పొత్తుకు సంకేతమా..? పవన్‌కు మద్ధతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్లు..

Janasena-TDP: భీమ్లా నాయక్‌కు టీడీపీ సపోర్ట్ వెనుక ఆంతర్యం అదేనా.. ఆసక్తికర కథనం మీకోసం..!
Janasena Tdp
Follow us

|

Updated on: Mar 02, 2022 | 10:26 PM

Janasena-TDP: భీమ్లా నాయక్‌కు టీడీపీ సపోర్ట్ ఫ్యూచర్ పొత్తుకు సంకేతమా..? పవన్‌కు మద్ధతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్లు మాట్లాడటం వెనుక అసలు ఆంతర్యం ఏమిటి..? అడగకుండానే అక్కున చేర్చుకుంటున్న పసుపు పార్టీపై జనసైనికులు ఏమనుకుంటున్నారు..? రాబోయే ఎన్నికల్లో పొత్తు విషయమై తెలుగుదేశం, జనసేన పార్టీల్లో అంతర్గతంగా ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి..? వీటన్నింటిపై రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారో, వారి అభిప్రాయం ఏంటో ఓ లుక్కేద్దాం..

ప్రస్తుతం ‘భీమ్లానాయక్’కు తెలుగుదేశం పార్టీ నుంచి అడగని అండ చాలానే దొరికిందని జనసేన నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవర్ స్టార్ ఏపీలోని సినిమా థియేటర్లు, టికెట్ల వ్యవహారంపై ఓ ముక్క కూడా మాట్లాడకపోయినా.. టీడీపీ నేతలు మాత్రం ప్రెస్ మీట్లు, వరుస ట్వీట్లతో హోరెత్తించారు. తాము మద్దతు కోరకపోయినా తెలుగు తమ్ముళ్ల నుంచి భీమ్లానాయక్ కు ఇంత సపోర్ట్ రావడంపై ఆశ్చర్యంలో ఉంది జనసేన శిబిరం.

రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావాలంటే జనసేనతో తప్పనిసరిగా పొత్తు ఉండాల్సిందేనని టీడీపీ భావిస్తోంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. జనసేనతో పొత్తులేకుండా బరిలోకి దిగిన తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది. ఓట్లు చీలి వైసీపీకి లాభం కలిగింది. 2024 ఎన్నికల్లో కూడా పొత్తు లేకపోతే మళ్లీ వైసీపీకే అధికారం దక్కడం ఖాయమని టీడీపీ భావించే.. జనసేనపై ప్రేమకురిపిస్తున్న అనేది టాక్.

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం గెలవాలంటే.. జనసైనికుల మద్దతు ఉండాలి. కానీ జనసేన అధిష్ఠానం మాత్రం ఇప్పటికీ పొత్తుపై పెదవి విప్పడంలేదు. టీడీపీ రమ్మంటున్నా.. జనసేన చూద్దాం అనే ధోరణి ప్రదర్శిస్తోంది. పైగా తమ పార్టీ పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగుపడిందని భావిస్తోంది. ఎందుకంటే గత రెండేళ్లుగా క్యాడర్‌ను పెంచుకోవడపై జనసేన అధిష్ఠానం ప్రధానంగా దృష్టి పెట్టింది. అభిమానులు ఉన్నారు కాని ఓట్లు వేయడంలే, చూడటానికి వస్తున్నారు కాని ఎన్నికల్లో సైడైపోతున్నారు. ఈ లోపాన్ని సరిచేసుకునే పనిలో ఉంది పవన్ పార్టీ. విస్తృతంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, క్యాడర్ పెంచుకునే పనులు చేస్తోంది.

మరోవైపు 2019 ఎన్నికల టైమ్‌తో పోలిస్తే జనసేన ఇప్పుడు బలపడిందని టీడీపీ కూడా భావిస్తోంది. ఇది తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందని కూడా అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్‌ను టీడీపీ నేతలు సందు దొరికినప్పుడల్లా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. భీమ్లానాయక్ సినిమా రిలీజ్ టైంలో కూడా ఇదే జరిగింది. ఎలాగూ జనసైనికులు, పవన్ అభిమానులు సినిమా విషయంపై ప్రభుత్వంతో ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు మద్ధతు పలకడం ద్వారా తమపై మంచి అభిప్రాయం జనసైనికుల్లో కలగాలని స్కెచ్ వేసినట్టుంది తెలుగుదేశం. అందుకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ పవన్ కళ్యాణ్‌కు మద్దతు పలికారని భావిస్తున్నారు.

మొత్తానికి రాబోయే ఎన్నికల్లో పొత్తుపై టీడీపీ నేరుగా పచ్చజెండా ఊపేస్తే.. జనసేన మాత్రం అంతర్గతంగా ఆలోచనలు చేస్తోంది. త్వరలో జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవంలో ఫ్యూచర్ పొత్తులపై జనసేనాని పవర్ స్టార్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

– విక్రమ్, టీవీ9 తెలుగు, విజయవాడ.

Also read:

Viral Video: మాంచి ప్లేస్‌ చూసుకుని మరీ రెచ్చిపోయాయి.. కుక్కల గ్యాంగ్ వార్.. చూస్తే గుండెలదిరిపోతాయి..!

Russia Ukraine War: తక్షణమే ఖార్కివ్ నుండి బయటపడండి.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ గంటలో రెండో ఆదేశం!

Pathan: ఎట్టకేలకు ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించిన బాలీవుడ్ బాద్‌షా.. పఠాన్ రిలీజ్‌ డేట్‌ను చెప్పేసిన షారుఖ్‌..