Minister Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేసేందుకు ప్లాన్.. కుట్రను భగ్నం చేసిన పోలీసులు..
ఎక్సైజ్, పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు నిందితులు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.
బిగ్ బ్రేకింగ్. వెరీ బిగ్‌బ్రేకింగ్.. ఏకంగా రాష్ట్ర కేబినెట్‌లోని ఓ మంత్రినే టార్గెట్ చేశారు. మర్డర్ చేసేందుకే స్కెచ్ వేశారు. హైదరాబాద్‌లో తీగ లాగితే ఢిల్లీలో డొంక కదులుతోంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్రను ఛేదించారు హైదరాబాద్ పోలీసులు. సుపారీ గ్యాంగ్‌తో చంపేందుకు ప్లాన్ చేసినట్లు తేల్చారు. ఇందుకోసం ఏకంగా 15 కోట్ల రూపాయల డీల్ కూడా సెట్ చేశారు.
ఫరూక్ అనే వ్యక్తికి ఈ సుపారీ మొత్తాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అయితే అప్రూవర్‌గా మారిన ఫరూక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంచలనం బయటకు వచ్చింది. హత్య కుట్రపై పేట్‌బషీరాబాద్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ ప్లాన్‌లో భాగస్వాములైన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌ను నిన్న హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు పోలీసులు.. నాగరాజుపై గతంలోనూ పలు హత్య కేసులు ఉన్నట్లు గుర్తించారు..ఈ ముగ్గురు ఇచ్చిన సమాచారంతో హత్య కుట్రలో భాగస్వామి అయిన మున్నూరు రవిని ఢిల్లీలోని బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి క్వార్టర్‌లో అరెస్ట్ చేశారు పోలీసులు.
Read Also.. Telangana Congress: మరో కీలక నేత కాంగ్రెస్‌ని వీడుతారా? హాట్ టాపిక్‌గా మారిన తాజా గుసగులు..!