సమయం లేదు మిత్రమా..! ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన బస్సు.. డ్రైవర్ ఏం చేశాడో చూస్తే అవాక్కే..!
నగరంలో ట్రాఫిక్ కష్టాలపై సోషల్ మీడియాలో చర్చ మరింత ఘాటుగా మొదలైంది. ఇంత భారీ ట్రాఫిక్‌లో డ్రైవర్ తన పని తాను చేసుకుపోవడంపై పలువురు ఆందోళన, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, నగరంలో ట్రాఫిక్ కష్టాలను పరిష్కరించడంలో పరిపాలన విఫలమైందని మరికొందరు విమర్శించారు. ఇంతకీ వైరల్ అవుతున్న వీడియోలో ఏముందంటే..
బెంగళూరులో ట్రాఫిక్ ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బెంగళూరు ట్రాఫిక్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. వీడియోలో, ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న బస్సు డ్రైవర్ వాహనం ముందు సీటులో కూర్చుని చేస్తున్న పనికి నెటిజన్లు నోరెళ్లబెట్టారు. నగరంలోని సిల్క్ బోర్డు జంక్షన్‌లో ఈ వీడియో రికార్డైనట్టుగా తెలిసింది. ఇప్పటికే ఈ వీడియోను 1.4 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారు. దీంతో బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలపై సోషల్ మీడియాలో చర్చ మరింత ఘాటుగా మొదలైంది. ఇంత భారీ ట్రాఫిక్‌లో డ్రైవర్ తన పని తాను చేసుకుపోవడంపై పలువురు ఆందోళన, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, నగరంలో ట్రాఫిక్ కష్టాలను పరిష్కరించడంలో పరిపాలన విఫలమైందని మరికొందరు విమర్శించారు. ఇంతకీ వైరల్ అవుతున్న వీడియోలో ఏముందంటే..
బెంగళూరులోని సిల్క్ బోర్డు సమీపంలో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన ఒక బస్సు డ్రైవర్.. టైమ్ వెస్ట్ చేసుకోకుండా తన ఆకలి తీర్చుకునే పనిలో పడ్డాడు. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న బస్సు డ్రైవర్ తను కూర్చున్న సీట్లోనే భోజనం చేస్తున్నాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇదంతా వీడియో తీశారు. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయటంతో అదికాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో “బెంగళూరులో అత్యంత రద్దీగా ఉండే క్షణం” అనే క్యాప్షన్‌తో వచ్చింది. ఇంటర్నెట్ వినియోగదారులను ఉలిక్కిపడేలా చేసింది ఈ వీడియో. ఇంత ట్రాఫిక్, డ్యూటీ హడావిడి వల్ల డ్రైవర్ కు కూర్చొని తినడానికి కూడా సమయం లేదంటూ ఓ వ్యక్తి వీడియోపై వ్యాఖ్యానించాడు.
నగరం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఎదుర్కొనే సమస్యలను ఈ వీడియో గుర్తు చేస్తుంది. బెంగళూరు నగరం దాదాపు 20 మిలియన్ల జనాభాను కలిగి ఉంది. 2031 నాటికి 25 మిలియన్లకు చేరుకుంటుంది. నగరం అవస్థాపన, ముఖ్యంగా రోడ్లు, ప్రజా రవాణా, ఒత్తిడికి గురవుతుంది. నగరంలో నెలకొన్న ట్రాఫిక్ కష్టాలు నివాసితులు, వ్యాపారులను ఒకేలా నిరాశపరుస్తున్నాయి.. వాటి వల్ల సమయం, డబ్బు వృధా చేయడంతోపాటు వాతావరణ కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతోంది.
View this post on Instagram