AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care Secret: సాయిపల్లవి పొడవాటి జుట్టు రహస్యం ఇదేనట..! కలబందతో కలిపి..

ఈరోజుల్లో చాలా మంది అమ్మాయిలు మొటిమల గురించి చాలా బాధపడుతున్నారు. కానీ, సాయిపల్లవి నటించిన సినిమాల్లో ఆమె మొటిమలే హైలెట్ గా అనిపిస్తాయి. తన ముఖంపై మొటిమలు ఉన్నాయని, వాటిని చూపించకుండా కవర్‌ చేయాలని కూడా తను ఎప్పుడూ భావించదు. అంతేకాదు..ఫెయిర్‌నెస్ క్రీమ్ బ్రాండ్‌తో రూ. 2 కోట్ల అడ్వర్టైజ్‌మెంట్ డీల్‌ను ఆమె ప్రమోట్ చేయడంపై నమ్మకం లేనందున తిరస్కరించింది మీకు తెలుసా?

Hair Care Secret: సాయిపల్లవి పొడవాటి జుట్టు రహస్యం ఇదేనట..! కలబందతో కలిపి..
Sai Pallavi's Hair Care Sec
Jyothi Gadda
|

Updated on: May 30, 2023 | 7:08 PM

Share

సాయి పల్లవి ప్రేమమ్, లవ్ స్టోరీ, శ్యామ్ సింఘా రాయ్, గార్గి వంటి చిత్రాలలో తన ఆన్‌స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఎప్పుడూ మంత్రముగ్దులను చేసింది. ఆఫ్-స్క్రీన్‌లో కూడా, ఆమె తన సింప్లిసిటీతో ప్రజల దృష్టిని ఆకర్షించింది. సాయి పల్లవి తన ఒరిజినల్ స్కిన్, జాలువారే రింగురింగుల జుట్టుతో మెరిసిపోతుంది. ఆమె స్క్రీన్‌పై,బయట కూడా మేకప్‌ లేకుండానే ఉంటుంది. మేకప్ వేసుకోవడానికి సాయిపల్లవి ఎప్పుడూ ఇష్టపడదు. అందుకే ఆమె చాలా సినిమాల్లో మేకప్ ను ఎక్కువగా ఉపయోగించలేదు. సహజంగానే నటించేందుకు ఆసక్తి చూపుతుంది. అయితే డ్యాన్స్ కోసం మేకప్ చేసుకుంటానని, అయితే దానికి కూడా పరిమితులు ఉన్నాయని చెప్పింది. మరో విశేషమేమిటంటే.. ఆమె బయటకు వెళ్లేటప్పుడు లేదా ఇతర సమయాల్లో మేకప్ అస్సలు వేసుకోదట. ఈరోజుల్లో చాలా మంది అమ్మాయిలు మొటిమల గురించి చాలా బాధపడుతున్నారు. కానీ, సాయిపల్లవి నటించిన సినిమాల్లో ఆమె మొటిమలే హైలెట్ గా అనిపిస్తాయి. తన ముఖంపై మొటిమలు ఉన్నాయని, వాటిని చూపించకుండా కవర్‌ చేయాలని కూడా తను ఎప్పుడూ భావించదు.

ఇక సాయిపల్లవి తన స్కిన్ విషయానికి వస్తే,..తనకు ఆహారం విషయంలో పెద్దగా కోరికలేమీ లేవట. అయితే ఈమెకు సాయిబాబా భక్తురాలు కాబట్టి, ఎక్కువగా శాఖాహారం తీసుకునేందుకు ఇష్టపడుతుందట. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆమె చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే మార్గాలు. సినిమాలో నాకు చాలా మొటిమలు ఉన్నాయి, కానీ ప్రజలు నన్ను అలాగే అంగీకరించారు. ఆత్మవిశ్వాసమే నిజమైన అందం అని నేను తెలుసుకున్నాను” అని సాయి పల్లవి 2019 లో తన ఇంటర్వ్యూలో చెప్పారు. కృత్రిమంగా తయారు చేసిన సబ్బులు, షాంపూలను తాను అస్సలు వినియోగించనని సాయిపల్లవి చెప్పుకొచ్చారు. తల వెంట్రుకల కొరకు, శరీర సంరక్షణ కొరకు న్యాచురల్ గా తయారు చేసిన వాటిని మాత్రమే తాను వాడతానని సాయిపల్లవి చెప్పుకొచ్చారు. అంతేకాదు..ఫెయిర్‌నెస్ క్రీమ్ బ్రాండ్‌తో రూ. 2 కోట్ల అడ్వర్టైజ్‌మెంట్ డీల్‌ను ఆమె ప్రమోట్ చేయడంపై నమ్మకం లేనందున తిరస్కరించింది మీకు తెలుసా?

ఇకపోతే, సాయి పల్లవి తన పొడవాటి, మెరిసే జుట్టును ఎలా చూసుకుంటుందంటే..

సాయి పల్లవి తన కాలేజీ రోజుల్లో చాలా హెయిర్ కలర్‌ను ఉపయోగించానని చెప్పింది. డాన్సర్ గా తన జుట్టుకు రకరకాల కెమికల్ ఉత్పత్తులు వాడటం, కలరింగ్ చేసుకోవడం వల్ల, తన కురులు బాగా దెబ్బతిన్నట్టుగా చెప్పింది. ఇక అప్పటి నుంచి వాటికి దూరంగా ఉంటానని వెల్లడించింది. ఇక అప్పటి నుంచి కురులకు సహజసిద్ధంగా లభించే కలబంద గుజ్జును మాత్రమే రాస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

చర్మం, జుట్టుకు కలబందతో కలిగే ప్రయోజనాలు..

జుట్టుకు అలోవెరా జెల్‌ని ఉపయోగించడం వల్ల చుండ్రును అరికట్టవచ్చు. ఇది జుట్టు పెరుగుదలను పెంచడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, ఇ పుష్కలంగా ఉన్నందున కలబంద మీ చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. ముఖం కోసం మొక్క నుండి నేరుగా సేకరించిన కలబంద జెల్ మీ చర్మంపై అప్లై చేసుకోవచ్చు. ఇది పొడిబారిన చర్మంపై ఏర్పడే వాపు, ఎరుపును తగ్గిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం