AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పులికే చుక్కలు చూపించిన ఎద్దు.. వీడియో చూస్తే మీరూ షాకవ్వాల్సిందే

Bull vs Tiger: అడవిలో సింహం తర్వాత క్రూరమైన జంతువు ఏదంటే అందరూ పులి అనే చెబుతారు. ఎందుకంటే దీనికి కూడా చాలా బలం ఉంటుంది. ఆకలితో ఉన్నప్పుడు ఏ జంతువైనా దాని కంటపడితే ఆహారంగా మారిపోవాల్సిందే.

Viral Video: పులికే చుక్కలు చూపించిన ఎద్దు.. వీడియో చూస్తే మీరూ షాకవ్వాల్సిందే
Bull Vs Tiger
Basha Shek
|

Updated on: Sep 01, 2022 | 10:05 AM

Share

Bull vs Tiger: అడవిలో సింహం తర్వాత క్రూరమైన జంతువు ఏదంటే అందరూ పులి అనే చెబుతారు. ఎందుకంటే దీనికి కూడా చాలా బలం ఉంటుంది. ఆకలితో ఉన్నప్పుడు ఏ జంతువైనా దాని కంటపడితే ఆహారంగా మారిపోవాల్సిందే. ఈనేపథ్యంలో పులి వేటకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోలో’ కింగ్‌ ఆఫ్‌ జంగిల్’ పేరున్న పులిని ఓ ఎద్దు భయపెట్టింది. అవును మీరు విన్నది నిజమే. ఈ వీడియోలో ఓ ఎద్దు ఆడవిలో రోడ్డుపై వేగంగా పరిగెడుతుంటుంది. అప్పుడే అడవిలో నుంచి వచ్చిన ఓ పులి ఎద్దుపై దాడి చేయాలని చూసింది. కానీ ఎద్దు ఎలాంటి భయం లేకుండా వేగంతో మీదకు రావడం చూసి పులి జంకుతుంది. వెంటనే వెనక్కు పరుగులు తీస్తుంది. ఇక్కడ ఒకవేళ ఎద్దు భయపడి ఉంటే పులికి ఆహారంగా మారి ఉండేది.. అయితే ధైర్యంగా ఎదిరించడంతో పులి వెనక్కు పారిపోయింది.

‘భయపడితే.. భయపడుతూనే ఉంటాం.. అదే మనమే భయపెడితే’ అని ఓ తెలుగు సినిమాలో డైలాగ్‌ ఉంటుంది. పైన చెప్పిన వీడియోలో ఎద్దు కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అయినట్లుంది. అందుకే పులిని సైతం వణికించింది. ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా పోస్ట్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 24 సెకన్ల ఈ వీడియో క్లిప్‌కు ఇప్పటివరకు వేలాది వ్యూస్‌, వందల కొద్దీ లైక్‌లు వచ్చాయి. నెటిజన్లు కూడా భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..