Kacha Badam Singer: మ‌రో పాట.. నా కొత్త కారు అంటూ అదరగొట్టిన క‌చ్చా బాద‌మ్ సింగ‌ర్.. వేరే లెవెల్‌ అంటున్న నెటిజన్స్

Kacha Badam Singer: భుబ‌న్ బ‌ద్యాక‌ర్(Bhuban Badyakar) వేరుశనగలు అమ్ముకుంటూ కచ్చాబాదం సింగర్‌ పాటతో ఓవర్‌నైట్‌ సెలబ్రిటీ అయిపోడు. దేశ, విదేశాల్లోనే గుర్తింపు సొంతం చేసుకున్నాడు. భుబ‌న్ క‌చ్చా బాద‌మ్ అనే బెంగాలీ..

Kacha Badam Singer: మ‌రో పాట.. నా కొత్త కారు అంటూ అదరగొట్టిన క‌చ్చా బాద‌మ్ సింగ‌ర్.. వేరే లెవెల్‌ అంటున్న నెటిజన్స్
Kacha Badam Singer Bhuban B
Follow us
Surya Kala

|

Updated on: Mar 06, 2022 | 8:52 AM

Kacha Badam Singer: భుబ‌న్ బ‌ద్యాక‌ర్(Bhuban Badyakar) వేరుశనగలు అమ్ముకుంటూ కచ్చాబాదం సింగర్‌ పాటతో ఓవర్‌నైట్‌ సెలబ్రిటీ అయిపోడు. దేశ, విదేశాల్లోనే గుర్తింపు సొంతం చేసుకున్నాడు. భుబ‌న్ క‌చ్చా బాద‌మ్ అనే బెంగాలీ సాంగ్ (Bengali Song).. అంత‌ర్జాతీయంగా గుర్తింపు పొందింది. సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా ఆ పాట గురించే చ‌ర్చ‌. ఏదో ప‌ల్లీలు అమ్ముకుంటూ స‌ర‌దాగా పాడిన పాట‌.. త‌న‌కు ఇంత గుర్తింపును తీసుకొస్తుందిన భుబ‌న్ కూడా ఊహించ‌లేదు. ఒకే ఒక్క పాట‌తో భుబ‌న్ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ అయిపోయారు. ఆ త‌ర్వాత భుబన్‌కు చాలా ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. డ‌బ్బులు కూడా వచ్చాయి. దీంతో ఓ సెకండ్ హాండ్ కారు కొనుక్కున్నారు భుబ‌న్. కష్టాలు తీరి ఆనందంగా జీవితం కొనసాగిద్దామనుకున్న ఆయనను దురదృష్టం యాక్సిడెంట్‌ రూపంలో టచ్‌ చేసింది. కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న క్రమంలో దురదృష్ట వశాత్తు ఆయనకు యాక్సిడెంట్ ఆస్పత్రి పాలయ్యారు. ప్రమాదంలో చాతికి గాయాల‌య్యాయి. ఆసుప‌త్రిలో ట్రీట్‌మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయినా ఆయన అక్కడితో ఆగిపోలేదు… ఇలా జరిగిందేంటని కృంగిపోలేదు. మరోపాటతో మళ్లీ సోషల్‌ మీడియాను తనవైపు తిప్పుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవ్వ‌గానే కారు యాక్సిడెంట్ మీద‌నే భుబ‌న్ మ‌రో పాట పాడారు.

అమ‌ర్ నోటున్ గారి “నా కొత్త కారు” అంటూ భుబ‌న్ పాడిన పాట ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. క‌చ్చా బాద‌మ్ ఫీవ‌ర్ పోక‌ముందే మ‌రో పాట‌ను భుబ‌న్ పాడ‌టంతో నెటిజ‌న్లు ఖుషీ అవుతున్నారు. ఆ పాట‌కు కూడా స్టెప్స్ వేస్తూ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Also Read:

 మహిళాదినోత్సవం సందర్భంగా మనదేశంలో మొదటి న్యూస్ రీడర్‌గా చరిత్ర సృష్టించిన.. మహిళ ఎవరో తెలుసా..