Viral Video: మొదటిసారి పిజ్జాను రుచి చూసిన చిన్నారి ఫీలింగ్స్ అద్భుతం.. మాకు మళ్ళీ బాల్యం కావాలంటున్న నెటిజన్లు..

చిన్నారి మొదటి సారి పిజ్జాను రుచి చూస్తూ.. ఆస్వాదించిన తీరు అందరికీ ఆకట్టుకుంటుంది. పిజ్జాని కొరికిన అనంతరం.. ఆ రుచిని ఆస్వాదించడానికి చిన్నారి కళ్ళు మూసుకుంది.

Viral Video: మొదటిసారి పిజ్జాను రుచి చూసిన చిన్నారి ఫీలింగ్స్  అద్భుతం.. మాకు మళ్ళీ బాల్యం కావాలంటున్న నెటిజన్లు..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jun 04, 2022 | 8:40 PM

Viral Video: ప్రపంచంలో అనేక రకాల ప్రజలు.. భిన్న ఆచారాలు ఆహారపు అలవాట్లు.. అయితే అనేక మంది అత్యంత ఇష్టంగా తినే ఆహారపదార్ధాల్లో ఒకటి పిజ్జా. ఇటాలియన్ డిష్ పిజ్జాను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రేమిస్తారు. అయితే నిజంగా పిజ్జాను తింటూ ఎలా ఆస్వాధించాలో పిల్లలకే బాగా తెలుసు అనిపిస్తుంటుంది.. కొన్ని సందర్భాల్లో.. అయితే పిజ్జాలో ఉండే టాపింగ్స్ ను పిల్లలు పెద్దగా ఇష్టపడక పోయినా రకరకాల పిజ్జాలను తినడానికే ఆసక్తిని చూపిస్తారు.  నిజానికి పిజ్జాను ఎలా తినాలో పిల్లలకు నిజంగా తెలుసు. తొలిసారిగా ఓ చిన్నారి పిజ్జా ట్రై చేస్తున్న వీడియో (Viral Video) సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది.

ఎవరైనా సరే తమకు ఇష్టమైన సినిమా చూడాలని లేదా ఇష్టమైన పుస్తకాన్ని మొదటిసారి చదవాలని.. తమకు ఇష్టమైన    వంటకాన్ని రుచి చూడాలని అనుకుంటారు. అంతేకాదు.. తమ కోరిక తీరుతున్న సమయంలో వారి ఫీలింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ నేపథ్యంలో చిన్నారి మొదటి సారి పిజ్జాను రుచి చూస్తూ.. ఆస్వాదించిన తీరు అందరికీ ఆకట్టుకుంటుంది. పిజ్జాని కొరికిన అనంతరం.. ఆ రుచిని ఆస్వాదించడానికి చిన్నారి కళ్ళు మూసుకుంది.  పాప అందమైన ఫీలింగ్స్ అమ్మను నవ్వించాయి. అంతేకాదు  మీరు పిజ్జా ప్రేమికులైతే .. మళ్ళీ మీ బాల్యానికి వెళ్లగలిగితే.. మీరు మీ మొదటి పిజ్జాను రుచి చూసేటప్పుడు ఇలాగే ప్రతిస్పందిస్తారని అంటున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Baby (@emotional.babies)

ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో ‘oh_shoot_girl’ లో అప్‌లోడ్ చేసారు. ’emotional.babies’ పేజీలో షేర్ చేసారు. ఈ వీడియో  11.9 మిలియన్లకు పైగా వ్యూస్ ను , 1.1 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..