Viral Video: కదులుతున్న రైలు ఎక్కుతూ పడబోయిన మహిళ.. వేగంగా స్పందించిన రైల్వే పోలీస్..

కదులుతున్న రైలులో ఎక్కడం లేదా బోర్డింగ్ పై ప్రయాణం అపాయకరం అంటూ రైల్వేశాఖ అధికారులు ప్రయాణీకులకు హెచ్చరిక చేస్తూనే ఉంటాయి. అయితే కొంతమంది ప్రయాణీకులు రైల్వే హెచ్చరికలను పట్టించుకోరు. ఫలితంగా, పర్యవసానాలను అనుభవిస్తారు

Viral Video: కదులుతున్న రైలు ఎక్కుతూ పడబోయిన మహిళ.. వేగంగా స్పందించిన రైల్వే పోలీస్..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jun 02, 2022 | 6:21 PM

Viral Video: తమ గమ్య స్థానానికి చేరుకోవాలనే తొందరలో.. చేసే పనులు ఒకొక్కసారి ప్రాణాపాయంగా మారవచ్చు.. ముఖ్యంగా కదులుతున్న బస్సులు, రైళ్ల వంటి వాహనాల్లో ఎక్కాలనే ప్రయత్నంలో చేసే పనులు వ్యక్తులను ప్రమాదంలో పడేయవచ్చు. కొందరు ఇటువంటి ప్రయత్నాల సమయంలో వికలాంగులుగా మారితే.. కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోగొట్టుకున్న ఉదంతాలు అనేకం.  తాజాగా కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ ప్లాట్‌ఫారమ్‌పై పడిపోయింది. అయితే ఆ మహిళను రైల్వే పోలీసు కాపాడాడు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కుతుండగా ఓ మహిళ ప్లాట్‌ఫారమ్‌పై పడింది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ ప్లాట్‌ఫారమ్‌పై పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది ఆమెను రక్షించాడు.  ప్లాట్‌ఫారమ్,  రైలు మధ్య గ్యాప్‌లో మహిళ పడిపోకుండా అడ్డుకున్నాడు. అదృష్టవశాత్తూ.. ఈ సంఘటన జరిగినప్పుడు రైల్వే పోలీసు.. ఆ మహిళ వైపు ప్లాట్‌ఫారమ్‌పై నడుచుకుంటూ వస్తున్నాడు.. ఆ మహిళ చేస్తున్న సాహసాన్ని చూసిన అతను.. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి..  ఆమె ప్రాణాలను రక్షించాడు.

ఇవి కూడా చదవండి

ఈ విషయం సీసీటీవీ లో రికార్డ్ అయింది. రైల్వే పోలీసు వెంటనే స్పందించిన విధానంపై రైల్వే అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వీడియో అధికారిక సోషల్ మీడియా పేజీలో షేర్ చేస్తూ.. కదులుతున్న రైలులో ఎక్కవద్దు,  దిగవద్దు, అది ప్రాణాంతకం కావచ్చు’’ అని ట్వీట్‌ చేశారు.

అయితే రైల్వే పోలీసు ఇలా కదులుతున్న రైళ్లో ఎక్కుతున్న ప్రయాణికుల  ప్రాణాలను కాపాడడం.. ఇదే మొదటిసారి కాదు. కొద్ది రోజుల క్రితం ప్రయాగ్‌రాజ్ స్టేషన్‌లో అప్రమత్తమైన ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) కానిస్టేబుల్ ఒక వ్యక్తి ప్రాణాలను రక్షించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.  అదేవిధంగా, భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు .. ప్లాట్‌ఫారమ్ మధ్య పడిపోతున్న ఒక మహిళను ఆర్‌పిఎఫ్‌కి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఇటీవల రక్షించాడు. ఈ ఘటనను సీసీటీవీ కెమెరాలో రికార్డయిన సంగతి తెలిసిందే..

కదులుతున్న రైలులో ఎక్కడం లేదా బోర్డింగ్ పై ప్రయాణం అపాయకరం అంటూ రైల్వేశాఖ అధికారులు  ప్రయాణీకులకు హెచ్చరిక చేస్తూనే ఉంటాయి. అయితే కొంతమంది ప్రయాణీకులు రైల్వే హెచ్చరికలను పట్టించుకోరు.  ఫలితంగా, పర్యవసానాలను అనుభవిస్తారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు