AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: తనని తానే పెళ్లి చేసుకుంటున్న యువతి.. పెళ్ళికి సోలోగామిగా పేరు.. హనీమూన్‌ గోవాలోనే అట

ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్న వార్తల గురించి తరచుగా వింటూనే ఉన్నాం.. అయితే ఇప్పుడు సరికొత్తగా ఒక యువతి.. తనని తానే పెళ్లి చేసుకుంటుంది. అంతేకాదు వివాహం అనంతరం హనీమూన్ కు గోవా కూడా వెళ్లనున్నది. ఈ విచిత్రమైన పెళ్ళికి వేదికగా గుజరాత్ రాష్ట్రం కానున్నది.

Viral News: తనని తానే పెళ్లి చేసుకుంటున్న యువతి.. పెళ్ళికి సోలోగామిగా పేరు.. హనీమూన్‌ గోవాలోనే అట
Vadodara Woman To Marry Her
Surya Kala
|

Updated on: Jun 02, 2022 | 3:27 PM

Share

Viral News: లొకోభిన్నరుచిః అన్నారు పెద్దలు.. ఈ మాట నేటి జనరేషన్ కు సరిగ్గా సరిపోతుంది. ముఖ్యంగా కాలక్రమంలో వచ్చిన అనేక మార్పుల్లో ఒకటి వివాహ బంధంలో కూడా చోటు చేసుకున్నాయి. స్త్రీ, పురుషులను వివాహం అనే బంధంతో ఏకం చేసి.. సరికొత్త జీవితాన్ని అందించే ఈ బంధంలో కూడా మార్పులు వచ్చాయి. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్న వార్తల గురించి తరచుగా వింటూనే ఉన్నాం.. అయితే  ఇప్పుడు సరికొత్తగా ఒక యువతి.. తనని తానే పెళ్లి చేసుకుంటుంది. అంతేకాదు వివాహం అనంతరం హనీమూన్ కు గోవా కూడా వెళ్లనున్నది. ఈ విచిత్రమైన పెళ్ళికి వేదికగా గుజరాత్ రాష్ట్రం కానున్నది. వివరాల్లోకి వెళ్తే..

24 ఏళ్ల వడోదరకి చెందిన  క్షమా బిందు అనే యువతి జూన్ 11న పెళ్లి చేసుకోనుంది. అయితే ఈ పెళ్ళికి వరుడు సిద్ధంగా లేడు. ఆ యువతి తనని తానే పెళ్లి చేసుకుంటోంది. క్షమా బిందు వివాహం సాంప్రదాయ శైలిలో జరుగుతుంది. ఈ వివాహ వేడుక అగ్నిసాక్షి, సింధురం వంటి అన్ని ఆచార సంప్రదాయాల ప్రకారం జరగనుంది. అయితే.. పెళ్లి కొడుకు, ఊరేగింపు మాత్రం ఉండదు.  ఈ విషయంపై క్షమా బిందు మాట్లాడుతూ.. “తన యుక్తవయస్సు నుండి.. ఎన్నడూ తాను వివాహం చేసుకోవాలని అనుకోలేదని చెప్పింది.  ఒక ఒకవిధంగా చెప్పాలంటే.. తనను ఎన్నడూ పెళ్లి ఆకర్షించలేదని చెప్పింది. అయితే తనకు వధువు కావాలనే కోరిక ఉందని.. అందుకనే తనని తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. అంతేకాదు ఈ పెళ్ళిని ‘సోలోగామి ,” అని అంటారని క్షమా తెలిపింది.

తనకు ఓ వెబ్ సిరీస్ లో చెప్పిన డైలాగ్ అమితంగా నచ్చిందని.. “ప్రతి స్త్రీ వధువు కావాలని కోరుకుంటుంది.. కానీ భార్య కాదు” అని ఒక వెబ్ సిరీస్‌లో నటి చెప్పడం విన్నానని క్షమా గుర్తు చేసుకున్నది.

ఇవి కూడా చదవండి

MS విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీలో పట్టాపుచ్చుకున్న బిందు.. ఓ ఇప్పుడు  ప్రైవేట్ సంస్థలో ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిగా పనిచేస్తోంది.  తనని తాను వివాహం చేసుకోవాలనే ఆలోచనల గురించి తెలుపుతూ.. ఆన్‌లైన్‌లో భారతదేశంలో తనను తాను వివాహం చేసుకున్న మహిళ ఇప్పటి వరకూ ఎవరూ ఉన్నట్లు చూపించలేదని తెలిపింది. వివాహాన్నీ పవిత్రంగా భావించే మన దేశంలో స్వీయ ప్రేమకు ఉదాహరణగా నిలిచిన మొదటి వ్యక్తి నేనే కావచ్చు’’ అని వధువు క్షమా చెప్పింది.

“స్వీయ-వివాహం అనేది మీ కోసం ఉండాలనే నిబద్ధత..  తనపై తనకున్న బేషరతు ప్రేమని తెలియజేస్తుంది. ఇది యుక్తవయస్సులోకి అడుగుపెట్టడాన్ని గుర్తించడం..  స్వీయ-అంగీకార చర్య ని పేర్కొంది. యువతీయువకులు తమను  ఇష్టపడే వారిని వివాహం చేసుకుంటారు. నేను నన్ను ప్రేమిస్తున్నాను .. అందుకే ఈ వివాహం అని వివరించింది. క్షమా తల్లిదండ్రులు కూడా ఆమె స్వీయ వివాహానికి ఆశీస్సులు అందించారు.

ఇప్పటికే క్షమా స్వీయ-వివాహం కోసం దాదాపు 15 మంది స్నేహితులు , సహోద్యోగులకు ఆహ్వానాలను అందించారు. ఈ వివాహ వేడుకలు జూన్ 9న మెహందీ వేడుకతో ప్రారంభం కానున్నాయి.  వధువు తన వివాహానికి ఐదు ప్రమాణాలు రాసింది. గోత్రిలోని ఒక ఆలయంలో ఘనంగా జూన్ 11న పెళ్లి చేసుకోనుంది. పెళ్లి త‌ర్వాత రెండు వారాల పాటు హ‌నీమూన్‌కి గోవా వెళ్ల‌నుంది క్ష‌మ‌.

మరిన్ని వైరల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..