AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అల్లరి కోతులకు కూడా క్రమశిక్షణ ఉంది.. IFS అధికారి షేర్ చేసిన ఫన్నీ వీడియో వైరల్..

కోతులు చేసే పనుల గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఇవి చేసే అల్లర్లకు అంతే ఉండదు. అందుకు సాక్ష్యంగా కోతుల చిలిపి పనులుకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Viral Video: అల్లరి కోతులకు కూడా క్రమశిక్షణ ఉంది.. IFS అధికారి షేర్ చేసిన ఫన్నీ వీడియో వైరల్..
Viral Video
Surya Kala
|

Updated on: May 28, 2022 | 11:50 AM

Share

Viral Video: జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. కుక్కలు, పిల్లులు, ఏనుగులు, కోతులకు సంబంధించిన వీడియోలు టనే వైరల్ అవుతాయి. ఇక వీటిల్లో మరి చిలిపి పనులు చేసేవి అయితే కోతులనే చెప్పవచ్చు. కోతులు చేసే పనుల గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఇవి చేసే అల్లర్లకు అంతే ఉండదు. అందుకు సాక్ష్యంగా కోతుల చిలిపి పనులుకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకప్పుడు అడవిలో నివసించే ఈ జీవులు ఇప్పుడు నగరాల్లో కూడా చెట్లపై గడుపుతున్నారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో చాలా కోతులు రోడ్డుపై ఉన్న పండ్ల బుట్టల నుండి పండ్లను ఎంచుకుని తింటున్నాయి.

వైరల్ అవుతున్న వీడియోలో రోడ్డు మధ్యలో  పీచ్ ఫ్రూట్ (మకరంద పండ్లు)  ప్లాస్టిక్ బుట్టల్లో ఉంచారు. అప్పుడు ఆ పండ్ల బుట్టల దగ్గరకు వందలాది కోతులువచ్చాయి. అవి తమకు నచ్చిన పండ్లను ఏరుకుని బుట్టలల్లో నుంచి తీసుకుని పరిగెత్తడం ప్రారంభించాయి. అంతేకాదు.. తమ ముందు.. భారీ సంఖ్యలో పండ్లు ఉన్నా.. వాటిల్లో తమకు నచ్చిన ఒక పండుని తీసుకుని అక్కడ నుంచి చకచకా వెళ్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియోను IFS అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పటి వరకూ ఈ వీడియో 26 వేల మందికి పైగా చూశారు. ఈ కోతులు మానవుల కంటే చాలా క్రమశిక్షణ కలిగి ఉన్నాయి. ఒకొక్క కోతి ఒకొక్క పండుని మాత్రమే తీసుకుంటుందని కామెంట్ చేస్తున్నారు.

మరొకరు .. ప్రపంచంలో దాతృత్వం కంటే గొప్ప మతం ఏదీ లేదు’ అని  అన్నారు. ఈ కోతులు మనుషుల కంటే తెలివైనవారుగా మరోసారి నిరూపించారు అని వ్యాఖ్యానించారు. అక్కడ అన్ని పండ్లు ఉన్నా.. ఒక్కొక్క కోతి ఒక్కో పండు మాత్రమే తీసుకుంటుంది.. ఇది కదా క్రమ శిక్షణ అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..