Viral Video: చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికాడు… మరీ టూ మచ్ బ్రో ఇది…
చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు వారితో పేరెంట్స్ సరదాగా కడిపే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. చంటి పిల్లల మీద పేరెంట్స్ కు కేర్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. కంటికి రెప్పలా వారిని చూసుకుంటూ ఉంటారు. ఇంటిలో కళ్ల ముందు...

చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు వారితో పేరెంట్స్ సరదాగా కడిపే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. చంటి పిల్లల మీద పేరెంట్స్ కు కేర్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. కంటికి రెప్పలా వారిని చూసుకుంటూ ఉంటారు. ఇంటిలో కళ్ల ముందు ఆడుతూ పాడుతూ సందడి చేసే పసిపిల్లలు ఒక్క క్షణం కనిపించకపోయినా తల్లిదండ్రులు పడే టెన్షన్ అంతా ఇంతా ఉండదు. వారు కనిపించేంత వరకు మనసు ఆందోళన చెందుతూనే ఉంటుంది. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. నవ్వు తెప్పించేలా ఉన్న ఈ వీడియో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది.
“చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు” సామెత లెక్కనే ఆ వీడియోలోని దృశ్యాలు ఉన్నాయి. వైరల్ అవుతున్న క్లిప్‌లో ఆ వ్యక్తి తన బిడ్డను తన వీపుకు ఉన్న బ్యాగ్‌లో సురక్షితంగా మోసుకెళతాడు. షాపింగ్ మాల్ లాగా కనిపించే ఓ చోట పిల్లల స్ట్రాలర్ పక్కన నిలబడి ఉన్నట్లు చూపిస్తుంది. అతను బిడ్డ కోసం వెతుకుతూ బాధతో చుట్టూ చూస్తున్నట్లు కనిపిస్తుంది. అతను స్ట్రాలర్‌ను తనిఖీ చేసి మొబైల్ ఫోన్‌లో ఎవరికైనా కాల్ చేస్తూ కనిపించాడు.
ఇంతలో ఒక స్త్రీ అతని వీపు వైపు చూపిస్తుంది. శిశువు తన వీపుకు కట్టి ఉందని ఆ వ్యక్తికి అర్థమవుతుంది. దీంతో టెన్షన్ ఫ్రీ అయిన అతను తన మొబైల్ ఫోన్‌లో డయల్ చేయడం ఆపి నవ్వుతూ కనిపిస్తాడు. “ఆ వ్యక్తి బిడ్డ కోసం వెతుకుతూ, బండిలోనే వదిలేశాడని భావించిన దృశ్యం అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. . ఆ పిల్లవాడు ఏడుస్తున్నప్పటికీ, ఆ క్షణంలో ఒత్తిడి వల్లే ఆ చిన్నారి తన వెనుకే ఉందని అతను గమనించలేకపోతున్నాడు అని క్యాప్షన్ పెట్టారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఆ వ్యక్తి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. “ఇలా అయితే అతను నిజంగా మంచి తండ్రి అని మీకు తెలుస్తుంది” అని ఒక వినియోగదారు రాశారు. ఇది నన్ను నవ్వించడమే కాదు ఏడిపించిందని మరొక యూజర్ కామెంట్స్ రాశారు. కొత్తగా తల్లిదండ్రులు అయితే ఇలాగే వింతగా ప్రవర్తిస్తారేమో అని మరొకరు కామెంట్స్ చేశారు.
వీడియో చూడండి:
View this post on Instagram