AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీవ్ర రక్త స్రావంతో ఆస్పత్రిలో చేరిన ఆడ కుక్క.. రక్తదానంతో ప్రాణం పోసిన మరో శునకం

అక్కడ డైసీని పరీక్షించిన వైద్యులు.. దాని కడుపులో ఉన్న కుక్కపిల్లలన్నీ చనిపోయాయని చెప్పారు. వెంటనే వాటిని తీసివేయాలని చెప్పారు. కానీ, అప్పటికే ఆ కుక్క బాగా రక్తాన్ని కోల్పోయింది. ఆ కుక్క రక్తంలో చక్కెర స్థాయి ప్రమాదకరంగా పడిపోయిందని గుర్తించారు. ఆడ కుక్కకు రక్తం అవసరమని, రక్తం ఎక్కించకుండా ఆపరేషన్ సాధ్యం కాదని చెప్పారు. లేదంటే ఆ కుక్క బతికే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయని చెప్పారు.

తీవ్ర రక్త స్రావంతో ఆస్పత్రిలో చేరిన ఆడ కుక్క.. రక్తదానంతో ప్రాణం పోసిన మరో శునకం
Dog Blood Donation
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 14, 2025 | 7:24 PM

రక్తదానాన్ని మహాదానం అంటారు. రక్తదానం మరొకరి జీవితానికి వెలుగును ప్రసాదిస్తుంది. రక్తదాతలు ప్రాణదాతలు. మూడు నెలలకోసారి రక్తదానం చేయడం వల్ల సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మరోకరికి ప్రాణదానం చేసినవారవుతారు. కానీ, ఒక మూగ జీవి మరో జంతువు ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం చేయడం ఎప్పుడైనా చూశారా..? అవును మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో ఒక కుక్క రక్తదానం చేయడం ద్వారా చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న ఒక కుక్క ప్రాణాలను కాపాడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సమాచారం ప్రకారం, అశోక్ నగర్ నివాసి సోను రఘువంశీ పెంపుడు కుక్క డైసీ అనే రెండేళ్ల ఆడ లాబ్రడార్ బిచ్ ఉంది. డైసీ దాదాపు 35 రోజుల గర్భవతి. గత కొన్ని రోజులుగా అది తీవ్ర రక్తస్రావం అవుతోంది. సోను, అతని కుటుంబ సభ్యులు వెంటనే డైసీని స్థానిక ప్రభుత్వ పశువైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ డైసీని పరీక్షించిన వైద్యులు.. దాని కడుపులో ఉన్న కుక్కపిల్లలన్నీ చనిపోయాయని చెప్పారు. వెంటనే వాటిని తీసివేయాలని చెప్పారు. కానీ, అప్పటికే ఆ కుక్క బాగా రక్తాన్ని కోల్పోయింది. ఆ కుక్క రక్తంలో చక్కెర స్థాయి ప్రమాదకరంగా పడిపోయిందని గుర్తించారు. ఆడ కుక్కకు రక్తం అవసరమని, రక్తం ఎక్కించకుండా ఆపరేషన్ సాధ్యం కాదని చెప్పారు. లేదంటే ఆ కుక్క బతికే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయని చెప్పారు.

ఆ కుక్కకు 3 యూనిట్ల రక్తం కోసం ఏర్పాట్లు చేసుకోవలని చెప్పగా, సోను వెంటనే స్థానిక సామాజిక కార్యకర్తలను సంప్రదించాడు. రక్తదాన గ్రూపులోని సభ్యులను సంప్రదించగా, వేరొకరు తమ పెంపుడు కుక్క రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. అలా రక్త మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు. ఎట్టకేలకు ఆపదలో ఉన్న లాబ్రడార్‌ బిచ్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది. ఆ పెంపుడు కుక్క కోలుకుంటున్నట్టుగా వైద్యులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..