Telugu News Trending Viral Photo: IAS officer shared an adorable picture related to childhood, people said – old days are fresh
Father’s Love Photo Viral: ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్.. నాన్న ప్రేమ ఆకాశమంత..
తాజాగా వైరల్ అవుతున్న చిత్రంలో.. ఒక వ్యక్తి తన మోటార్‌సైకిల్‌పై పెద్ద ప్లాస్టిక్ బొమ్మను తీసుకుని వెళ్లడం కనిపించడం మీరు చూడవచ్చు. ఈ ఫోటో చూస్తుంటే.. ఈ వ్యక్తి తన బిడ్డ కోసం ఇంటికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
Father’s Love Photo Viral: ఇంటర్నెట్ లో.. ప్రతిరోజూ ఏదో ఒక ఫోటో లేదా ఏదో ఒక వీడియో నెటిజన్లను ఆకర్షిస్తూ.. చర్చలో నిలుస్తుంది. కొన్ని ఫోటోలు, వీడియోలు చూసిన అనంతరం నవ్వుకుంటాం.. అదే సమయంలో కొన్ని ఆసక్తిని కలిగిస్తాయి. వాటిని చూసిన అనంతరం ఆశ్చర్యపోతాం. అయితే ఎవరికైనా బాల్యానికి సంబంధించిన ఏదైనా ఉదంతం లేదా చిత్రం జ్ఞాపకం చూస్తే.. సంతోషం కలుగుతుంది. అది సినీ నటులకు , క్రీడాకారులకు సంబంధించిన చిన్న నాటి ఫోటోలు మాత్రమే కాదు.. కష్టపడి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వారి ఫోటోలను కూడా నెటిజన్లు ఇష్టపడతారు. తాజాగా వైరల్ అవుతున్న చిత్రంలో.. ఒక వ్యక్తి తన మోటార్‌సైకిల్‌పై పెద్ద ప్లాస్టిక్ బొమ్మను తీసుకుని వెళ్లడం కనిపించడం మీరు చూడవచ్చు. ఈ ఫోటో చూస్తుంటే.. ఈ వ్యక్తి తన బిడ్డ కోసం ఇంటికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటోను చూసిన తర్వాత ప్రజలు తమ పాత రోజులు గుర్తుకు తెచ్చుకున్నారు. చాలా మంది ఈ చిత్రాన్ని అద్భుతం అని పేర్కొన్నారు.
ఈ ఫొటోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఫోటోని షేర్ చేస్తూ.. “ఈ రాత్రి ఎవరూ సంతోషంతో నిద్రపోలేరు” అనే క్యాప్షన్ కూడా జతచేశారు. ఈ ఫోటో వెలది మందిని ఆకట్టుకుంది. ఈ ఫోటోకి 61 వేల మందికి పైగా లైక్ చేశారు. పేదరికంలో ఉన్న ఏకైక గొప్ప విషయం ఏమిటంటే.. చిన్న విషయాలు కూడా మన ఆనందాన్ని పెంచుతాయి. ఈ ఫోటోతో మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అని ఒకరు.. తండ్రి వెంటే.. పిల్లల కలలన్నీ ఉన్నాయి.. తండ్రి ఉంటే, మార్కెట్లో ఉన్న బొమ్మలన్నీ వారివే ‘ అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు. తండ్రి ప్రేమ ఎప్పుడూ గొప్పదే అని సంతోషన్ని వ్యక్తం చేస్తున్నారు.
अपने बच्चों की खुशी के लिये हर पिता अक्सर एक एक्सपर्ट मिस्त्री भी बन जाता है..? pic.twitter.com/8mrAk6d1UU
— Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) May 24, 2022