Viral: జాలరికి ఝలక్ ఇచ్చిన చేప.. నీటిలోంచి దూకి అతని నోటిలోకి దూరింది.. చివరికు ఏం జరిగిందంటే..!
Viral: థాయ్‌లాండ్‌లో చేపల వేటకు వెళ్లిన ఒక వ్యక్తికి ఊహించని షాక్ ఇచ్చింది చెరువులోని చేప. చేప చేతికి చిక్కిద్దని భావిస్తే.. అది ఏకంగా అతని గొంతులోకి..
Viral: థాయ్‌లాండ్‌లో చేపల వేటకు వెళ్లిన ఒక వ్యక్తికి ఊహించని షాక్ ఇచ్చింది చెరువులోని చేప. చేప చేతికి చిక్కిద్దని భావిస్తే.. అది ఏకంగా అతని గొంతులోకి దూరింది. ఆ ఊహించని పరిణామంతో అతను తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఆస్పత్రికి చేరి శస్త్రచికిత్స చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. మే 22న ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లాడు. చెరువులో చేపల కోసం గాలం వేసి ఎదురుచూస్తూ ఉన్నాయి. ఇంతలో చేప గాలానికి చిక్కినట్లు అనిపిచంగా.. ఆ గాలాన్ని ఆబగా తీసేందుకు ప్రయత్నించాడు. అయితే, చేప గాలానికి చిక్కిందని సంతోషపడేలోపే.. అది ఊహించని షాక్ ఇచ్చింది. నీటిలోంచి ఎగిరిన చేప.. నేరుగా ఆ జాలరి నోట్లోకి వచ్చి పడింది. అలా అది గొంతులోకి జారుకుని.. అన్నవాహిక, శ్వాసనాళానికి మధ్యలో ఇరుక్కుపోయింది. దాంతో అతను శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు ఎక్సరే తీసి చూశారు. అనాబాస్ అనే స్పైకీ చేప గొంతులో చిక్కుకుందని గుర్తించారు. అయితే, చేప గొంతులో ఇరుక్కపోవడం వలన అతనికి తీవ్ర గాయమైంది. వైద్యులు చాలా కష్టపడి అతని గొంతులో ఇరుక్కున్న చేపను జాగ్రత్తగా బయటకు తీశారు.
“ఇది జరిగే అవకాశాలు చాలా తక్కువ. నేను ఇంతకు మునుపెన్నడూ ఇలాంటి కేసును చూడలేదు.’’ అని రోగికి చికిత్స చేసిన ఆసుపత్రి వైద్యులు సెర్మశ్రీ పాథోంపనిచ్రత్ అన్నారు. ‘‘మా డాక్టర్లు రోగి అంతర్గత అవయవాలకు నష్టం జరుగకుండా చాలా కష్టపడి శస్త్ర చికిత్స చేశారు. శస్త్ర చికిత్స విజయవంతం అయ్యింది. రోగి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.’’ అని చెప్పారు ఆస్పత్రి యాజమాన్యం.