Viral Video: కూతురు బర్త్‌డేకి వ్యాపారి స్పెషల్ పార్టీ.. లక్ష పానీపూరీలు ఉచితంగా పంపిణీ .. కూతుళ్ళ గొప్పదనం తెలియజేసేందుకే ఇలా..

లక్షకు పైగా  పానీపూరీలు ప్రజలకు ఉచితంగా అందించాడు. దీని కోసం 31 స్టాల్స్ ను ఏర్పాటు చేసి.. ఉచితంగా పానీపూరీని పంపిణీ చేశాడు. మొత్తానికి కుమార్తె మొదటి పుట్టిన రోజున సుమారు 1,10,000 పానీపూరీలు ఉచితంగా పంపిణీ చేశాడు.

Viral Video: కూతురు బర్త్‌డేకి వ్యాపారి స్పెషల్ పార్టీ.. లక్ష పానీపూరీలు ఉచితంగా పంపిణీ .. కూతుళ్ళ గొప్పదనం తెలియజేసేందుకే ఇలా..
Birth Day Party
Follow us

|

Updated on: Aug 19, 2022 | 11:20 AM

Golgappa Viral Video: ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి రూపంగా భావించిన తండ్రి.. తన గారాల ముద్దుల తనయ మొదటి పుట్టిన రోజు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. కూతుళ్లతోనే భవిష్యత్తు సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ.. కుమార్తె పుట్టిన వేడుకల్లో పానీపూరీని ఉచితంగా పంపిణీ చేశాడు. ఈ పానీ పూరి విలువ 50 వేల రూపాయలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

1 లక్షకు పైగా ఉచిత గొల్గప్పలను పంపిణీ చేసి తన కుమార్తె మొదటి పుట్టినరోజును జరిపారు తల్లిదండ్రులు. పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్  చేసి జరుపుకునే పద్ధతులను బ్రేక్ చేస్తూ.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక పానీపూరీ విక్రేత తన కుమార్తె మొదటి పుట్టిన రోజు వేడుకలను భిన్నంగా జరిపాడు. తనకు ఎంతో ప్రత్యేక రోజున అందరికి గుర్తుండిపోయేలా రుచికరమైన గొల్లగప్పలను అందించి వార్తల్లో నిలిచాడు. భోపాల్ లో స్ట్రీట్ ఫుడ్  పానీపూరీ వ్యాపారి అంచల్ గుప్తా తన ఆడబిడ్డ మొదటి పుట్టి రోజు సందర్భంగా ఉచితంగా పానీ పూరీని పంపిణీ చేసి సంచలనం సృష్టించాడు. అంచల్ గుప్తాకు గత ఏడాది ఆగస్టు 17న  కుమార్తె పుట్టింది. ఈ ఏడాది మొదటి పుట్టిన రోజుని జరుపుకుంది ఆ చిన్నారి.

ఇవి కూడా చదవండి
Free Golgappas

Free Golgappas

తనకు “ఆడబిడ్డ పుట్టడం వలన తన కల నిజమైందని అంచల్ గుప్త చెప్పారు. తనకు పెళ్లయినప్పటి నుంచి తనకు కూతురు పుట్టాలని కోరుకున్నట్లు చెప్పాడు. అయితే మొదటి సంతానంగా రెండేళ్ల క్రితం కొడుకు పుట్టాడు’’ అని అంచల్ గుప్త చెప్పాడు. అయితే తన కోరికను తీరుస్తూ.. గత ఏడాది తనకు కుమార్తె పుట్టిందని.. చెప్పాడు. ఇప్పుడు 2022లో తన కుమార్తె మొదటి పుట్టినరోజు సందర్భంగా పానీపూరిని ప్రజలకు ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకున్నాడు. అలా ఒకరికి కాదు ఇద్దరికీ కాదు.. ఏకంగా వందల సంఖ్యలో పానీపూరీలను పంపిణీ చేశాడు. లక్షకు పైగా  పానీపూరీలు ప్రజలకు ఉచితంగా అందించాడు. దీని కోసం 31 స్టాల్స్ ను ఏర్పాటు చేసి.. ఉచితంగా పానీపూరీని పంపిణీ చేశాడు. మొత్తానికి కుమార్తె మొదటి పుట్టిన రోజున సుమారు 1,10,000 పానీపూరీలు ఉచితంగా పంపిణీ చేశాడు.

ఇలా చేయడానికి కారణం ఆడపిల్లలను చదివించాల్సిన ఆవశ్యకత గురించి అందరికి సందేశం పంపడమే లక్ష్యమని పేర్కొన్నాడు. గుప్తా చేసిన పని గురించి తెలుసుకున్న ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..