AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16 ఏళ్లుగా సెలవులో ఉన్నా 11 కోట్ల జీతం తీసుకున్న టీచర్.. ఆ సమయంలో ఏం చేసిందంటే..

ఒక టీచర్ 16 సంవత్సరాలుగా అనారోగ్యం కారణంగా సెలవులో ఉంది. అయితే ఆమె ప్రతి నెలా పూర్తి జీతం పొందుతుంది. దీని కారణంగా ఆమె రూ. 11 కోట్లకు పైగా జీతం సంపాదించింది. ఈ కేసు మీకు వింతగా అనిపించవచ్చు కానీ ఇది జర్మనీలో జరిగింది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ టీచర్ కథ గురించి తెలుసుకుందాం...

16 ఏళ్లుగా సెలవులో ఉన్నా 11 కోట్ల జీతం తీసుకున్న టీచర్.. ఆ సమయంలో ఏం చేసిందంటే..
German Teacher
Surya Kala
|

Updated on: Sep 12, 2025 | 1:25 PM

Share

ఒక టీచర్ 16 సంవత్సరాలుగా అనారోగ్యంతో సెలవులో ఉంది. ఒక్క రోజు కూడా స్టూడెంట్స్ కు పాఠాలు చెప్పలేదు. అయినా సరే ఆమెకు ప్రతి నెలా పూర్తి జీతం లభిస్తుంది. దీంతో ఇప్పటివరకు ఆమె మన దేశ కరెన్సీలో 11 కోట్ల రూపాయలకు పైగా జీతాన్ని తీసుకుంది. అంతేకాదు 16 ఏళ్లుగా సెలవులో ఉన్నా.. ఇప్పటికీ ఉద్యోగంలో ఉంది. ఈ ఘటన జర్మనీలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ టీచర్ కు సంబంధించిన విషయం వైరల్ అవుతోంది. నిజానికి ఈ పరిస్థితి వ్యవస్థలోని లోపం వల్ల తలెత్తింది.. చర్చనీయాంశంగా మారింది.

నార్త్ రైన్ వెస్ట్‌ఫాలియాలోని ఒక కాలేజీలోని టీచర్ 2009 నుంచి సిక్ లీవ్ లో ఉంది. ఇలా ఆమె ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు.. ఏకంగా 16 సంవత్సరాలు సిల్ లీవ్ లో ఉంది. ఈ 16 నెలల్లో ఆ మహిళ ఒక్క రోజు కూడా కళాశాలలో పని చేయలేదు.. అయితే ప్రతి నెలా ఒక్క రూపాయి కూడా కటింగ్ లేకుండా పూర్తి జీతం తీసుకుంటూనే ఉంది.

16 సంవత్సరాలలో ఎంత డబ్బు తీసుకున్నదంటే

ఇవి కూడా చదవండి

జర్మన్ వార్తాపత్రిక డై వెల్ట్ నివేదిక ప్రకారం జర్మనీలోని ఈ టీచర్ ప్రతి నెలా దాదాపు 6,174 యూరోలు (సుమారు 6.3 లక్షల రూపాయలు) జీతం పొందుతుంది. అంటే ఆమె సంవత్సరానికి దాదాపు 72,000 యూరోలు (74 లక్షల రూపాయలు) పొందుతుంది. ఇలా ఆ టీచర్ 16 సంవత్సరాలలో ఒక్క రోజు టీచింగ్ చెప్పకుండానే ఒక మిలియన్ యూరోలకు పైగా (సుమారు 11.6 కోట్ల రూపాయలు) సంపాదించింది.

కేసు ఎలా వెలుగులోకి వచ్చిందంటే

జర్మన్ చట్టం ప్రకారం ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వారికి నిరవధిక అనారోగ్య సెలవు సమయంలో జీతం పొందే ప్రత్యేక హక్కు ఉంది. ఇటీవల కొత్త కళాశాల నిర్వాహకుడు ఆడిట్ చేసి.. ఈ టీచర్ గురించి తెలుసుకుని.. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించారు. తనకు కాలేజీ ప్రిన్సిపల్ చేసిన సూచనను పాటించడానికి బదులుగా.. ఆ ఉపాధ్యాయురాలు కోర్టులో స్కూల్ నిర్వాహకుల తీరుపై సవాలు చేసింది. స్కూల్ యాజమాన్యం తన హక్కులను ఉల్లంఘిస్తుందని పేర్కొంది.

కోర్టు ఏం ఆదేశించింది?

జర్మన్ టీచర్ వేసిన కోర్టు కేసును కొట్టివేసింది. కాలేజీ యాజమాన్యం అడిగిన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేనిదని పేర్కొంది. అనారోగ్య రుజువు అడిగే హక్కు కళాశాల పరిపాలనకు ఉందని చెప్పింది. అంతేకాదు ఆ టీచర్ కు న్యాయపరమైన ఖర్చుల కోసం 2500 యూరోలు కళాశాలకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

సెలవు తీసుకున్న తర్వాత ఒక స్టార్టప్ ప్రారంభించిన టీచర్

జర్మనీలో కూడా ఈ కేసు వివాదాస్పదమైంది. ఎందుకంటే ఆ మహిళ ఇంత సుదీర్ఘ సెలవులో ఒక మెడికల్ స్టార్టప్‌ను ప్రారంభించింది. ఇప్పుడు దర్యాప్తులో ఆ మహిళకు ఎటువంటి తీవ్రమైన అనారోగ్యం లేదని రుజువైతే.. అది నిబంధనల ఉల్లంఘన అవుతుంది. అటువంటి పరిస్థితిలో ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోవలసి ఉంటుంది. జీతం , పెన్షన్ కూడా లభించదు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూ. 10 లక్షల పెట్టి కారు కొంటున్నారా.? అయితే ప్రభుత్వం మీకు డబ్బు
రూ. 10 లక్షల పెట్టి కారు కొంటున్నారా.? అయితే ప్రభుత్వం మీకు డబ్బు
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..