AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఎర్రబస్సు అనుకున్నాడో ఏమో.. టికెట్ లేకుండా విమానంలో ప్రయాణించేశాడు.. అదెలాంగే..!

Viral News: మీకు సిసింద్రి సినిమా గుర్తుందా? ఆ సినిమాలో చిన్నారిని కిడ్నాపర్లు అపహరించుకుుపోగా.. ఆ చిన్నారి వారి నుంచి తప్పించుకుని

Viral News: ఎర్రబస్సు అనుకున్నాడో ఏమో.. టికెట్ లేకుండా విమానంలో ప్రయాణించేశాడు.. అదెలాంగే..!
Boy
Shiva Prajapati
|

Updated on: Mar 05, 2022 | 7:46 AM

Share

Viral News: మీకు సిసింద్రి సినిమా గుర్తుందా? ఆ సినిమాలో చిన్నారిని కిడ్నాపర్లు అపహరించుకుుపోగా.. ఆ చిన్నారి వారి నుంచి తప్పించుకుని నగరం మొత్తం కలియతిరుగుతాడు. బస్సులో, ఆటోలో, ఇలా వాహనాల్లో సిటీ మొత్తం రౌండ్ వేస్తాడు. అయితే, ఇదంతా సినిమాలో సాధ్యమైంది. కానీ, ఇప్పుడు రియల్‌ ఓ బాలుడు గగనతలంలో చెక్కర్లు కొట్టాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 2,700 కిలోమీటర్ల దూరం.. టికెట్ లేకుండానే విమానంలో తిరిగాడు. ఈ పిల్లాడికి సంబంధించిన వార్త ఇప్పుడు బిగ్ టాపిక్ అయ్యింది. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళితే.. బ్రెజిల్‌కు చెందిన ఇమాన్యయెల్ మార్క్వెస్ ఒలివెరా(9).. తన స్వస్థలం నుంచి గ్వారుల్‌హోసాండ్‌కు వెళ్లాలని ఫిక్స్ అయ్యాడు. ఎలా చేరుకున్నాడో ఏమోగానీ.. నేరుగా లాతమ్ ఫ్లైట్‌ ఎక్కేశాడు. దాదాపు 2,700 కిలోమీటర్లు టికెట్ లేకుండా ప్రయాణించాడు. ఆ చిన్నారి వెంట తల్లిదండ్రులు కూడా, పెద్దలు కానీ ఎవరూ లేకపోవడం ఆశ్చర్యం. తీరా ఫ్లైట్ ల్యాండ్ అయిన తరువాత బాలుడి కిందకు దిగుతుండగాన్ని సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అసలు ఫ్లైట్ ఎలా ఎక్కాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? టికెట్ లేకుండా విమానశ్రయం లోపలికి వచ్చి మరీ విమానం ఎక్కడం ఎలా సాధ్యమైందని అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

అయితే, టికెట్ లేకుండా ఇంతదూరం ప్రయాణించడం, అదికూడా విమానంలో ప్రయాణించడం వెనుక పెద్ద రెక్కీనే ఉన్నట్లు గుర్తించిన అధికారులు అవాక్కయ్యారు. అవును మీరు విన్నది నిజమే. పిట్ట కొంచెం కూత గనం అన్నట్లు.. వాడు చిన్నోడే అయినా తెలివి తేటలు పీక్స్‌లో ఉన్నాయి. టిక్కెట్ లేకుండా ఫ్లైట్‌లోకి ఎలా వెళ్లాలి? స్కాట్ ఫ్రీగా వెళ్లడానికి మార్గాలేంటి? అనేది ట్యుటోరియల్ వీడియోలను చూసి తెలుసుకున్నాడు. దాన్ని ఆధారంగా వాడు.. చాలా తెలివిగా విమానం ఎక్కి.. 2,700 కిలోమీటర్లు టికెట్ లేకుండానే హాయిగా ప్రయాణించాడు.

ఇదిలాఉంటే.. తమ కుమారుడు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందారు ఆ చిన్నారి తల్లిదండ్రులు. విషయం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు.. బాలుడు సెక్యూరిటీ స్కాన్‌ల నుంచి ఎలా తప్పించుకోగలిగాడు, చీట్ చేసి ఎలా విమానంలోకి దూరాడు. అంతదూరం ఎలా ప్రయాణించగలిగాడు. అనే దానిని తెలుసుకునేందుకు మనౌస్ విమానాశ్రయ అధికారులు దర్యాప్తుు చేస్తున్నారు. అయితే, ఆ చిన్నోడు.. సావోపాలో లోని తన కుటుంబ సభ్యులను కులుసుకోవాలని భావించి ఇలా చేశాడని పోలీసులు నిర్ధారించారు.

Also read:

Drugs: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ పోలీసులు.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

Russia Ukraine Crisis Live: తగ్గేదెలే అంటున్న రష్యా.. ఉక్రెయిన్‌పై దాడులు ముమ్మరం..

Medaram Hundi: మేడారం హుండీ లెక్కింపు పూర్తి.. ఈసారి తగ్గిన ఆదాయం.. ఇంకా తేలాల్సిన బంగారం, వెండి కానుకల లెక్కలు