AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాతి వైరం పక్కనబెట్టి.. ప్రాణ స్నేహితులుగా మారిన లియో-డాలీ ప్రేమ..! మనుషులకే కనువిప్పు

స్నేహం చేయడానికి భాషతో గానీ, జాతితో గానీ పనిలేదు.. మనసులు కలిస్తే చాలని నిరూపిస్తున్నాయి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని రెండు మూగజీవాలు. పిల్లి, కుక్కల మధ్య జన్మతః ఉండే జాతి వైరాన్ని మరిచి, మేము ప్రాణ స్నేహితులమే అంటూ అల్లారుముద్దుగా జీవిస్తున్నాయి లియో, డాలీ. ఒకే కుటుంబంలో పెరగడమే కాకుండా, ఒకదానిని విడిచి మరొకటి క్షణం కూడా ఉండలేనంతగా ఇవి బంధాన్ని పెంచుకున్నాయి. ఆస్తుల కోసం గొడవపడే మనుషులకు కనువిప్పు కలిగిస్తూ, ఈ మూగజీవాలు పంచుతున్న అపారమైన ప్రేమ, మైత్రి గురించిన పూర్తి ఆసక్తికరమైన కథనం ఇప్పుడు చూద్దాం..

జాతి వైరం పక్కనబెట్టి.. ప్రాణ స్నేహితులుగా మారిన లియో-డాలీ ప్రేమ..! మనుషులకే కనువిప్పు
Cat And Dog Friendship
N Narayana Rao
| Edited By: |

Updated on: Jul 15, 2026 | 10:03 PM

Share

స్నేహానికి మించినది ఈ లోకంలో మరొకటి లేదు అని పెద్దలు ఊరికే అనలేదు. ఈ మాటను అక్షరాలా నిజం చేస్తూ, మనుషులకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాయి రెండు మూగజీవాలు. సాధారణంగా పిల్లికి, కుక్కకు అస్సలు పడదు. పిల్లి కనిపిస్తే చాలు కుక్క వేటాడటానికి సిద్ధమవుతుంది. కానీ, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని వెంగళరావు కాలనీలో మాత్రం సీన్ రివర్స్ అయింది. అక్కడ ఒక పెంపుడు పిల్లి, పెంపుడు కుక్క ఒకే తల్లి బిడ్డల్లా, ప్రాణ స్నేహితుల్లా కలిసి తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

వెంగళరావు కాలనీలోని అద్భుత బంధం:

స్థానిక వెంగళరావు కాలనీలో నివసించే లక్ష్మి అనే యజమానురాలి ఇంట్లో ఈ అపురూప దృశ్యం నెలకొంది. ఆమెకు ముగ్గురు కుమారులు కాగా, వారంతా పెళ్ళిళ్లు చేసుకుని పక్కపక్క ఇళ్లలోనే నివసిస్తున్నారు. పెద్ద కుమారుడి ఇంట్లో డాలీ అనే పెంపుడు కుక్క ఉంటే, చిన్న కుమారుడి ఇంట్లో లియో అనే పిల్లి ఉంటుంది. ఈ రెండూ కూడా ఆడ జంతువులే కావడం విశేషం. ఇవి వేర్వేరు ఇళ్లలో ఉంటున్నప్పటికీ, ఒకే కుటుంబానికి చెందినవి కావడంతో నిత్యం కలిసిమెలిసి కాలక్షేపం చేస్తుంటాయి.

ఆస్తుల కోసం కొట్టుకునే మనుషులకు కనువిప్పు:

ఈ రోజుల్లో ఒకే తల్లి కడుపున పుట్టిన సొంత అన్నదమ్ములు ఆస్తి గొడవలతో కోర్టుల మెట్లు ఎక్కుతుంటే, సహజ సిద్ధమైన జాతి వైరం ఉన్న ఈ రెండు మూగజీవాలు మాత్రం క్షణం కూడా విడిపోకుండా కలిసి ఉంటున్నాయి. డాలీ లేకుండా లియో, అలాగే లియో లేకుండా డాలీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయవు. నిత్యం పక్కపక్కనే తిరుగుతూ, సరదాగా ఆడుకుంటూ ఇవి చేసే అల్లరి చూస్తే కాలనీ వాసులకు భలే ముచ్చటగా అనిపిస్తుంది. ఈ మూగజీవాల అద్భుతమైన ఫ్రెండ్‌షిప్‌ను చూడటానికి చుట్టుపక్కల ప్రజలు కూడా ఆసక్తిగా వచ్చి వెళ్తుంటారు. జాతులు వేరైనా, వైరం ఉన్నా.. ప్రేమ ముందు అవేవీ నిలవవని లియో-డాలీ నిరూపిస్తున్నాయి. ఈ మూగజీవాల సందడి చూసిన ప్రతి ఒక్కరూ ఔరా! స్నేహమంటే వీరిదే కదా అనకుండా ఉండలేకపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!