Dragon Chicken: ఈ కోడి ధర అక్షరాల రూ. లక్షన్నర.. అంతలా స్పెషల్‌ ఏంటనేగా..

సాధారణంగా మనం చూసే కోడి ధర ఎంత ఉంటుంది.? కోళ్ల ఫామ్స్‌లో కోడి అయితే ఓ రూ. 300 వరకు ఉంటుంది. అదే ఊరి కోడి అయితే ఎక్కువలో ఎక్కువ ఓ వెయ్యి రూపాయలు ఉంటాయి. అయితే ఈ ఫొటోలో కనిపిస్తోన్న కోడి ధర మాత్రం అక్షరాల రూ. లక్షన్నరకు..

Dragon Chicken: ఈ కోడి ధర అక్షరాల రూ. లక్షన్నర.. అంతలా స్పెషల్‌ ఏంటనేగా..
Drogon Chicken
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 23, 2023 | 6:17 PM

సాధారణంగా మనం చూసే కోడి ధర ఎంత ఉంటుంది.? కోళ్ల ఫామ్స్‌లో కోడి అయితే ఓ రూ. 300 వరకు ఉంటుంది. అదే ఊరి కోడి అయితే ఎక్కువలో ఎక్కువ ఓ వెయ్యి రూపాయలు ఉంటాయి. అయితే ఈ ఫొటోలో కనిపిస్తోన్న కోడి ధర మాత్రం అక్షరాల రూ. లక్షన్నరకు పైమాటే ఏంటి..? ఒక్క కోడి ధర రూ. లక్షన్నర ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా! ఆ కోడి ఏమైనా బంగారు గుడ్లు పెడుతుందా.? అని ప్రశ్నిస్తారా.? ఉత్తర వియత్నాంలోని రేర్‌ బ్రీడ్‌ ‘డాంగ్‌ టావో డ్రాగన్‌ చికెన్‌’కు సంబంధించి ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. ఇంతకీ ఈ కోడి ధర ఎందుకంత ఎక్కువ.? దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? లాంటి వివరాలపై ఓ లుక్కేయండి..

వియత్నంలోని డాంగ్‌ టావో అనే కమ్యూనిటీ ఈ కోళ్లను పెంచుతోంది. దీంతో ఈ కోళ్లకు ఆ పేరు వచ్చింది. ఈ కోళ్లలో వాటి కాళ్లు ప్రత్యేకం. కాళ్ల బరువు వాటి శరీరంలో ఐదవ వంతు ఉంటాయి. డ్రాగన్‌ కోళ్ల కాళ్లు ఎంత పెద్దగా ఉంటే కర్రీ అంత రుచిగా ఉంటుంది. ఈ కోళ్ల పెంపకంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. నాణ్యత గల మొక్కజొన్న, బియ్యంతో కూడిన ఫుడ్‌ను అందిస్తారు. అంతేకాదండోయ్‌ ఈ కోళ్లకు ప్రత్యేకంగా వ్యాయామం కూడా చేస్తాయి.

ఒకప్పుడు రాజ కుటుంబాలు మాత్రమే ఈ కోళ్లను పెంచుకునే వారు. వీటిని స్టేటస్‌ సింబల్‌గా, విలాసవంతమైన వస్తువుగా భావించేవారు. కానీ కాల క్రమేణా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. అయితే ధర విషయంలో మాత్రం సామాన్యులకు ఈ కోడి అంత సులభంగా అందదు. ఇక ఈ కోడి కూర వండడంలోనూ వైవిధ్య ఉంటుంది. ముందుగా చికెన్‌ను ఉడకబెట్టి.. అల్లం, నిమ్మకాయ, ఉల్లిపాయ, చేపల సాస్‌, మిరపకాయలతో కూర చేస్తారు. రుచి, ఆరోగ్యం విషయంలో ఈ డ్రాగన్‌ కోళ్లు ది బెస్ట్‌ అని చెబుతుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..