Viral Video: హమ్మయ్య! మీరూ మీరూ కొట్టుకొండ్రి.. నేను బ్రతికిపోయా.. కిర్రాక్ వీడియో మీకోసం
అడవిలో జీవితం ఎప్పుడూ ప్రమాదాల వలయం. క్రూర జంతువులు తమ ఆకలిని తీర్చుకునేందుకు ఎలప్పుడూ మరో జంతువుపై..
అడవిలో జీవితం ఎప్పుడూ ప్రమాదాల వలయం. క్రూర జంతువులు తమ ఆకలిని తీర్చుకునేందుకు ఎలప్పుడూ మరో జంతువుపై ఆధారపడక తప్పదు. ముఖ్యంగా పులి, సింహం, చిరుత లాంటి జంతువులకు చిక్కితే.. క్షణాల్లో ప్రాణాలు పోయినట్లే. కానీ ఇక్కడ ఓ గేదె సింహాలకు చిక్కింది. కానీ చివరికి ప్రాణాలతో బయటపడింది. ఇంతకీ అసలేం జరిగిందో ఈ వీడియోలో చూడండి.
సాధారణంగా అడవికి రాజైన సింహం వేట.. ఎప్పుడూ వన్ వేలోనే ఉంటుంది. చివరికి అదే గెలుస్తుంది. అయితే ఇక్కడ దానికి రివర్స్‌లో జరిగింది. తమలో తాము కొట్టుకుని.. ఎరగా దొరికిన అడవి గేదెను వదిలిపెట్టాయి సింహాలు. చివరికి ఆ సింహాల గుంపు తమలో తాము కొట్టుకుని.. గేదెను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాయి. దీంతో ఆ గేదె బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. జనవరి 21న షేర్ చేసిన దీనికి ఇప్పటివరకు 14.8 మిలియన్ల వ్యూస్, 1 లక్ష 41 వేల లైకులు వచ్చాయి. లేట్ ఎందుకు మీరు ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
Lions fight while eating a water buffalo, then it casually walks off pic.twitter.com/lEt2pApFT3
— Weird and Terrifying (@weirdterrifying) January 21, 2023