AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బైక్‌పై లవర్స్ రొమాన్స్.. కట్ చేస్తే.. యువకుడు చెప్పిన మాటకు కంగుతిన్న పోలీసులు..

ఈ రోజుల్లో లవర్స్ రెచ్చిపోతున్నారు. నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులు కూడా నలుగురు మధ్య రోడ్డుపై చేసేస్తున్నారు..

Viral Video: బైక్‌పై లవర్స్ రొమాన్స్.. కట్ చేస్తే.. యువకుడు చెప్పిన మాటకు కంగుతిన్న పోలీసులు..
Lovers Ride Bike
Ravi Kiran
|

Updated on: Jan 23, 2023 | 9:15 PM

Share

ఈ రోజుల్లో లవర్స్ రెచ్చిపోతున్నారు. నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులు కూడా నలుగురు మధ్య రోడ్డుపై చేసేస్తున్నారు. మొన్న వైజాగ్.. నిన్న లక్నో.. ఇప్పుడు ఛతీస్‌గడ్‌లో.. సేమ్ సీన్ రిపీట్. ఓ ప్రేమ జంట నడిరోడ్డుపై బైక్‌పెయిన్ రొమాన్స్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఛతీస్‌గడ్‌లోని భిలాయ్‌లో ఓ యువకుడు తన బైక్ ట్యాంక్‌పై అమ్మాయిని కూర్చోబెట్టుకుని దూసుకెళ్ళాడు. నడిరోడ్డుపై రొమాన్స్ చేస్తూ ఈ ప్రేమ జంట రెచ్చిపోయారు. ఇంటర్నెట్‌లో ఈ వీడియో క్షణాల్లో వైరల్ కాగా.. అది కాస్తా చివరికి పోలీసుల వరకు చేరింది.

ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడ్ని గుర్తించి పట్టుకున్నారు. చోరీకి గురైన బైక్‌ను రూ. 9 వేలకు కొని తిరుగుతున్నట్లు అతడు పోలీసులకు చెప్పాడు. అలాగే తన మాజీ లవర్‌కు చూపించడం కోసమే ఈ వీడియోను తీశానంటూ వివరించాడు. దీంతో అతడు చెప్పిన మాటలకు పోలీసులు దెబ్బకు ఖంగుతిన్నారు. అంతేకాదు ఖాకీలు అతడ్ని మరోసారి ఇలా చేయకుండా గట్టిగా క్లాస్ పీకారు.