Viral Video: పాములు నీళ్లు తాగుతాయా?.. సమాధానం కావాలంటే ఈ వైరల్ వీడియో చూడాల్సిందే..
Snake Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి.
Snake Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. తాజాగా ఓ పాముకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వాస్తవానికి పాములు చాలా ప్రమాదకరమైన జంతువులు. వాటి పేరు వింటేనే.. చాలామంది భయంతో పరుగులు తీస్తుంటారు. ఇక దగ్గరగా ఓ పెద్ద పామును చూస్తే.. ఇక మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకటే ప్రాణం పోయినంత పనవుతుంది. తాజాగా ఓ పాముకు చెందిన వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. అందులో ఒక పాము కనిపిస్తుంది. దానికి ఒక వ్యక్తి తన చేతితో నీరు తాపిస్తున్నాడు. మీరు ఈ వీడియో చూస్తే.. వామ్మో ఇదేంటి అంటూ భయపడుతారు. అంతేకాకుండా మీ గుండె వేగం కూడా పెరుగుతుంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోను ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద షేర్ చేశారు. ‘వేసవి వచ్చింది కదా. కొన్ని నీళ్ల చుక్కలు చాలు కొన్ని ప్రాణుల ప్రాణాలను నిలపడానికి. అందుకే.. మీ ఇంటి ముందు కానీ. పెరట్లో కానీ.. కొన్ని నీళ్ల కంటెయినర్స్‌ను ఏర్పాటు చేయండి. చాలా జంతువులు, పక్షులకు ఆ నీటి చుక్కలే ప్రాణాధారం’ ఈ వీడియోను పోస్ట్ చేశారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను లక్షకు పైగా వీక్షించారు. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోను తెగ ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పాములు ఎప్పటికీ మనుషులకు స్నేహితులు కావంటూ ఒక యూజర్ కామెంట్ చేయగా.. అది ఎల్లప్పుడూ విషంతో ఉంటుందని.. దానితో జాగ్రత్తగా ఉండాలంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. పాములు నీళ్లు తాగడం ఇప్పటి వరకు చూడలేదని మరికొందరు స్పందిస్తున్నారు. కాగా గతంలోనూ పాములకు నీళ్లు తాగించే కొన్ని వీడియోలను నందా షేర్ చేశాడు సుశాంత నంద.
Summer is approaching. Your few drops can save someone’s life. Leave some water in your garden in a container for that can mean a choice between life & death for many animals? pic.twitter.com/ZSIafE4OEr
— Susanta Nanda IFS (@susantananda3) March 9, 2022
Chicken Rate: చికెన్ సామాన్యుడికి చిక్కనంటుంది.. నెల రోజుల్లోనే డబుల్ అయిన ధర