Virat Kohli: దాయాది దేశంలో కోహ్లీకి పెరుగుతోన్న క్రేజ్‌.. కరాచీ టెస్టులో ఇంట్రెస్టింగ్‌ ప్లకార్డుతో దర్శనమిచ్చిన పాక్‌ అభిమాని..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆటతీరుతోనే కాకుండా తన బిహేవియర్‌, ఆటిట్యూడ్‌తోనూ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడీ క్రికెటర్

Virat Kohli: దాయాది దేశంలో కోహ్లీకి పెరుగుతోన్న క్రేజ్‌.. కరాచీ టెస్టులో ఇంట్రెస్టింగ్‌ ప్లకార్డుతో దర్శనమిచ్చిన పాక్‌ అభిమాని..
Virat Kohli
Follow us
Basha Shek

|

Updated on: Mar 13, 2022 | 1:14 PM

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆటతీరుతోనే కాకుండా తన బిహేవియర్‌, ఆటిట్యూడ్‌తోనూ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడీ క్రికెటర్. ఇక దాయాది దేశమైన పాక్‌లో అయితే కోహ్లీని అభిమానించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇటీవల పాకిస్థాన్ సూపర్ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో ఓ అభిమాని ‘విరాట్‌ కోహ్లీ.. పాక్‌లో నువ్వు సెంచరీ కొడితే చూడాలని ఉంది’ అని రాసి ఉన్న పోస్టర్‌ని పట్టుకుని కనిపించాడు. పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ సైతం ఈ ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. ఇటీవలే ఆస్ట్రేలియా- పాకిస్తాన్‌ వేదికగా జరిగిన రావల్పిండి టెస్టులోనూ కొందరు పాక్‌ అభిమానులు కోహ్లీ పోస్టర్లతో కనిపించారు. తాజాగా కరాచీలో పాకిస్తాన్‌- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులోనూ ఇలాంటి సన్నివేశం ఒకటి కనిపించింది. పాక్‌ అభిమాని ఒకరు ఇంట్రెస్టింగ్‌ ప్లకార్డులో కనిపించారు. ఆ ప్లకార్డులో ‘డియర్‌ విరాట్! నువ్వు సెంచరీ చేసినా, చేయకపోయినా, నువ్వే నా హీరోవి’ అంటూ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించి సుమారు రెండేళ్లు దాటింది. 2019లో చివరి సారిగా బంగ్లాదేశ్‌పై కోహ్లి సెంచరీ సాధించాడు. కనీసం శ్రీలంకతో మొహాలీలో జరిగిన తన వందో టెస్టులోనైనా మూడంకెల స్కోరును చేరుకుంటాడని ఫ్యాన్స్ ఆశించారు. అయితే కేవలం 45 పరుగులు చేసి వెనుదిరిగాడు. తాజాగా అదే లంకేయులతో బెంగళూరులో ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోను కేవలం 23 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. మరి అభిమానులు ఆశిస్తున్నట్లు కోహ్లీ ఎప్పుడు మూడెంకల స్కోరు చేస్తాడో..

Also Read:AAP MLA Mother: పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఓడించిన ఆప్ ఎమ్మెల్యే తల్లి ఏం చేస్తారో తెలుసా?

Rashmika Mandanna: సమంత బాటలో నడవనున్న రష్మిక.? బీటౌన్‌లో చక్కర్లు కొడుతోన్న క్రేజీ న్యూస్‌..

Gowtham Adani: మరణాన్ని 15 అడుగుల నుంచి చూశానన్న గౌతమ్ అదానీ.. ఇంతకీ ఈ దిగ్గజ వ్యాపారవేత్తకు ఏమైంది..