Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dance in Running car Video: నడిరోడ్డుపై రెచ్చిపోయిన యువతి.. ఓపెన్‌ రూఫ్‌ కారులో హల్‌చల్‌.. మండిపడుతున్న నెటిజన్లు..

దేశవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ, రీళ్లు తయారు చేస్తూ వైరల్‌గా మారేందుకు ప్రజల్లో ఆసక్తి తగ్గడం లేదు. అలాంటి ఒక ఉదంతం తాజాగా మరోకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు ఘాటుగా స్పందించారు. బహిరంగ ప్రదేశంలో ఇలా గొడవ చేయడం తగదని పలువురు ఘాటుగా స్పందిస్తున్నారు.

Dance in Running car Video: నడిరోడ్డుపై రెచ్చిపోయిన యువతి.. ఓపెన్‌ రూఫ్‌ కారులో హల్‌చల్‌.. మండిపడుతున్న నెటిజన్లు..
Dance In Running Car
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 08, 2024 | 12:42 PM

బైక్‌లు, కార్లు నడుపుతూ పిచ్చి పిచ్చి విన్యాసాలు చేయడం కొందరికి చాలా ఇష్టం. తరచుగా యువతీ యువకులు సోషల్ మీడియాలో పాపులర్, ఫేమస్ కావడానికి అనేక విన్యాసాలు చేస్తారు. అయితే ఇలాంటి విన్యాసాలు ప్రాణాలను కూడా బలిగొంటాయి. అలాంటి షాకింగ్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ, రీళ్లు తయారు చేస్తూ వైరల్‌గా మారేందుకు ప్రజల్లో ఆసక్తి తగ్గడం లేదు. అలాంటి ఒక ఉదంతం తాజాగా మరోకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఒక అమ్మాయి రోడ్డు మధ్యలో ఓపెన్ కారులో నిలబడి డ్యాన్స్ చేస్తూ కనిపించింది, ఆ వీడియోను వెనుక కారులో కూర్చున్న ఎవరో షూట్‌ చేశారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ఓ యువతి కదులుతున్న కారులో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆ వీడియో క్యాప్షన్‌ను బట్టి చూస్తే ఇది ఢిల్లీలో జరిగిన ఘటన అని చెబుతున్నారు. ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు ఘాటుగా స్పందించారు. బహిరంగ ప్రదేశంలో ఇలా గొడవ చేయడం తగదని పలువురు ఘాటుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో నేపథ్యంలో ఓ సినిమా పాట ప్లే అవుతోంది. ఓపెన్ రూఫ్‌తో ఉన్న ఎరుపు రంగు కారు సీటుపై నిలబడి అమ్మాయి డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. ఈ కారు రోడ్డు మీద వెళ్లోంది.. రద్దీగా ఉండే రోడ్డుపై కూడా ఆమె ఎలాంటి భయం లేకుండా అవిశ్రాంతంగా డ్యాన్స్‌ చేస్తూనే ఉంది. అందుకే ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియో నేపథ్యంలో ఓ సినిమా పాట ప్లే అవుతోంది. ఓపెన్ రూఫ్‌తో ఉన్న ఎరుపు రంగు కారు సీటుపై నిలబడి అమ్మాయి డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న జనం మాంచి షోగా చూస్తూనే ఉన్నారు. ఈ వీడియోను ఎపిక్ 69 అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీరి క్యాప్షన్ ‘జస్ట్ ఢిల్లీ థింగ్స్’ అని ఉంది. ఈ పోస్ట్‌పై చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇందులో కొందరు వారిని ఎగతాళి చేస్తుంటే మరికొందరు ఘాటైన విమర్శలు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..