Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘పఠాన్’ పాటకు స్టెప్పులేసిన జపాన్ పాప.. ఆ అందం, అభినయం వేరే లెవల్.. వైరల్ వీడియో మీ కోసం….

ప్రపంచంలోని ఎందరో సినిమా అభిమానులను ప్రభావితం చేసిన సినిమాలు, పాటలు మన దేశంలో చాలానే ఉన్నాయి. ఫలితంగా సినిమా సీన్‌లను స్పూఫ్ చేయడం, పాటలకు స్టెప్పులేయడం చేస్తుంటారు విదేశాలలోని సినీ

Viral Video:  ‘పఠాన్’ పాటకు స్టెప్పులేసిన జపాన్ పాప.. ఆ అందం, అభినయం వేరే లెవల్.. వైరల్ వీడియో మీ కోసం....
Japanese Girl Dancing For Besharam Rang
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 29, 2022 | 3:37 PM

అనేక విషయాలలో ప్రపంచానికి మన దేశం కేంద్ర బిందువులా ఉంటుంది. ఆ కారణంగానే భారతీయ సినీ ఇండస్ట్రీలో ఏదైనా కొత్త సినిమా పాట హిట్ అయితే ప్రపంచమంతా  కూడా ఊగిపోతుంది. ప్రపంచంలోని ఎందరో సినిమా అభిమానులను ప్రభావితం చేసిన సినిమాలు, పాటలు మన దేశంలో చాలానే ఉన్నాయి. ఫలితంగా సినిమా సీన్‌లను స్పూఫ్ చేయడం, పాటలకు స్టెప్పులేయడం చేస్తుంటారు విదేశాలలోని సినీ ప్రియులు కూడా. అలాంటి వీడియోలను మనం సోషల్ మీడియాలో ప్రతినిత్యం చూస్తూనే ఉంటాం. ఆ క్రమంలోనే ‘పఠాన్’ సినిమాలోని ‘భేషరమ్ రంగ్’ పాటకు జపాన్‌కు చెందిన ఓ యువతి స్టెప్పులేసింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జపాన్ పాప ఎంత అందంగా డ్యాన్స్ వేసిందంటే మాటలలో వర్ణించలేం కానీ నిజమైన పాటలో దీపికా పదుకొనే వేసినట్లే వేసింది. ఇసుమంత కూడా తేడా లేదంటే అతిశయోక్తి కాదేమో..

@mayojapan అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియో నెటిజన్లకు తెగనచ్చేస్తోంది. భేషరమ్ రంగ్ పాటలో దీపికా పదుకొనే వేసినట్లుగానే ఈ వీడియోలోని యువతి కూడా ప్రతి స్టెప్పును అందంగా వేయడాన్ని మనం చూడవచ్చు. ఇక పాటలో షారుఖ్ ఖాన్ పాత్రను ఈ వీడియోలో ఒక యువకుడు పోషించాడు. అతను కూడా బాగానే చేశాడని చెప్పుకోవచ్చు. రెండు రోజుల క్రితం పోస్ట్ అయిన ఈ వీడియోకు ఇప్పటి వరకు దాదాపు 17 వేల మంది లైక్ చేశారు. అలాగే నెటిజన్లు వారివారి స్పందనలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియోను ఇక్కడ చూడండి.. 

View this post on Instagram

A post shared by Mayo Japan (@mayojapan)

షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జాన్ అబ్రహం ప్రధాన పాత్రలలో నటించిన ‘పఠాన్’ సినిమాలోని ఈ ‘భేషరమ్ రంగ్’ పాట ఇటీవలి కాలంలో వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే ఏడాది( 2023) జనవరి 25న విడుదల కానున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ కొన్ని మార్పులు చేయాలంటూ సూచించింది. ఆ ప్రకారం పఠాన్ సినిమా, భేషరమ్ రంగ్ పాటలోని కొన్ని సీన్లను రీషూట్ చేయాలి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..