Its Selfie Time: సెల్ఫీ కోసం ‘ఆవు’ ఫోజులు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..నెటిజన్లు ఏమంటున్నారంటే..?

వివేక్ అనే యువకుడు కూడా ‘స్మైల్ ప్లీజ్’ అన్నాడు. అంతే సెల్ఫీ క్లిక్ అయిపోయింది. ఇక ఈ సెల్ఫీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. అలాగే ఆ వీడియోను చూసిన నెటిజన్లు అది చాలా అందంగా ఉందని, చాలా క్యూట్ సెల్ఫీ అని రకరకాలుగా..

Its Selfie Time: సెల్ఫీ కోసం ‘ఆవు’ ఫోజులు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Cow Posing For Selfie
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 13, 2023 | 6:31 AM

ఫ్రెండ్స్‌తో కలిసి ఎక్కడికైనా వెళ్లినప్పుడు.. ఆ స్మృతులు గుర్తుండిపోయేలా అందరం కలిసి సెల్ఫీలు దిగుతుంటాం. అలా సెల్ఫీ తీసుకునే ముందు ‘స్మైల్ ప్లీజ్’ అని ఫోటో క్లిక్ చేసేస్తాం. అచ్చం ఇలాగే వివేక్ అనే యువకుడు కూడా ‘స్మైల్ ప్లీజ్’ అన్నాడు. అంతే సెల్ఫీ క్లిక్ అయిపోయింది. ఇక ఈ సెల్ఫీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. అలాగే ఆ వీడియోను చూసిన నెటిజన్లు అది చాలా అందంగా ఉందని, చాలా క్యూట్ సెల్ఫీ అని రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

వివేక్ సెల్ఫీ తీసుకుంటే అందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా..?  అందులోనే ఉంది అసలు విషయం. సెల్ఫీ కోసం వివేక్ ‘స్మైల్ ప్లీజ్’ అని తన ఆవుతో అన్నాడు. అంతే, ఆ ఆవు ఎంతో అందంగా, క్యూట్‌గా ఫోజులిచ్చింది.  అలా వివేక్ సెల్ఫీ తీశాడు. ఈ సెల్ఫీ వీడియోని వివేక్ తన ఇన్‌స్టా ఖాతా నుంచి పోస్ట్ చేశాడు. ఇక అది కాస్త ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

ఆవు సెల్ఫీ వీడియోను ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Vivek vyas (@vivek_127)

కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘చాలా బాగుంది వీడియో. ఇలాంటి ఫ్రెండ్ నాకు కూడా ఉండే బాగుంటుంది. సెల్ఫీలే సెల్ఫీలు తీసుకుంటాన’ని కామెంట్ చేశాడు. మరొకరు అయితే ‘ప్రపంచంలోనే ఎంతో అందమైన సెల్ఫీ’ అని రాసుకొచ్చాడు. ఇదే రీతిలో అనేక మంది కూడా స్పందిస్తూ ‘జై గోమాత’, ‘వందే మాతరం’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 4 లక్షల 60 వేలకు పైగా లైకులు, అలాగే 22 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి.