Summer Diet: వేసవి వేడిని తరిమికొట్టే 7 ఆహారాలివే.. వడదెబ్బ, డీహైడ్రేషన్‌కి పరిష్కారం కూడా..

వేసవికాలంలో బయటకు వెళ్తే వడదెబ్బ లేదా డీహైడ్రేషన్ బారిన పడడం ఖాయం అనే పరిస్థితి. అయితే ఈ ఎండల నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చు. అవును, మన శరీరాన్ని ఈ ఎండలు, ఇంకా వేడి గాలుల నుంచి రక్షించుకునేందుకు కొన్ని రకాల ఆహారాలను తింటే..

Summer Diet: వేసవి వేడిని తరిమికొట్టే 7 ఆహారాలివే.. వడదెబ్బ, డీహైడ్రేషన్‌కి పరిష్కారం కూడా..
Stay Healthy
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 13, 2023 | 6:07 AM

ఇంకా మే నెల రాకుండానే ఎండలు మండిపోతున్నాయి. ఏసీ లేదా కూలర్‌ని కాసేపు ఆఫ్ చేసినా, ఇళ్లంతా ఉక్కపోతగా ఉంటుంది. ఇంట్లో ఇలా ఉందని, బయటకు వెళ్దామా అంటే సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. ఇలాంటప్పుడు బయటకు వెళ్తే వడదెబ్బ లేదా డీహైడ్రేషన్ బారిన పడడం ఖాయం అనే పరిస్థితి. అయితే ఈ ఎండల నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చు. అవును, మన శరీరాన్ని ఈ ఎండలు, ఇంకా వేడి గాలుల నుంచి రక్షించుకునేందుకు కొన్ని రకాల ఆహారాలను తింటే చాలు. వేసవిలో వచ్చే సమస్యలను ఎదుర్కొవడంతో పాటు మన శరీరాన్ని చల్లబరుచుకోవచ్చు. అంతేకాక వీటిని తీసుకోవడం వల్ల మన శరీరంలో వేడి కూడా తొలగిపోతుంది. మరి వేసవిలో మన శరీరంలోని వేడిని తొలగించి, మనల్ని కాపాడే ఆహారాలేమిటో ఇప్పుడు చూద్దాం..

మజ్జిగ: మజ్జిగకు శరీరంలోని వేడిని నియంత్రించే శక్తి ఉంది. అందువల్ల మీరు ఈ ఎండాకాలం వేడిని, వేడి గాలుల నుంచి రక్షణ కోసం మజ్జిగ తాగడం మంచిది. వేసవిలో ఎదురయ్యే అజీర్తి సమస్యలకు కూడా ఇది చక్కని పరిష్కారం. మజ్జిగ తాగడం వల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి వేసవి సమస్యల బారిన పడకుండా కూడా కాపాడుకోవచ్చు.

కొబ్బరి నీళ్లు: కాలంతో పని లేకుండా తాగవలసిన నీళ్లు ఇది. ఇంకా ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప ప్రసాదం కొబ్బరి నీళ్లు. సహజ సిద్ధంగా ఏర్పడే కొబ్బరి నీళ్లలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో ఉండే చక్కెర, ఎలక్ట్రోలైట్స్, ఖనిజ లవణాలు శరీరానికి ఉత్తేజాన్ని కూడా ఇస్తాయి.

ఇవి కూడా చదవండి

పుచ్చకాయ: వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయను ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు, పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకా ఇందులోని విటమిన్లు మీ శరీర  రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

కీరదోస: అన్ని కాలాలలోనూ లభించే కీరదోసల్లో ఉండే ఫైబర్, నీరు.. డీహైడ్రేషన్ నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. అంతేకాక వేసవికాలంలో ఎదురయ్యే మలబద్దకం, అజీర్తి సమస్యలకు ఇది చక్కని పరిష్కారం.

పూదీన: పూదీనకు శరీరంలో ఉండే వేడిని తొలిగించే గుణం ఉంది. అందుకే వేసవిలో పూదీనాను ఎక్కువగా వాడాలని నిపుణలు చెబుతుంటారు. ఎండాకాలంలో బయట పూదీన జ్యూస్ కూడా దొరుకుతుంది. దాన్ని తాగినా కూడా మంచిదే.

ఉల్లిగడ్డ: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిగడ్డ అంత మంచిది. ఉల్లిగడ్డ శరీరాన్ని చల్లబరచడంతో పాటు ఎండదెబ్బ తగలకుండా కాపాడుతుంది . అందుకే కూరల్లో, చట్నీల్లో, సలాడ్స్‌లో ఉల్లిపాయలను ఎక్కువగా వాడడం మంచిది.

నిమ్మరసం: వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి నిమ్మరసం ఒక చక్కని దివ్యౌషధం. వేసవిలో ఎక్కువగా నిమ్మరసంతో చేసిన షర్బత్ తాగితే చాలా బెటర్. ఇందులో ఉండే విటమిన్ సీ మీ వ్యాధినిరోధక వ్యవస్థను పటిష్టపరిచి మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..