Exercise for Heart: మీ చిన్ని గుండెను కాపాడే వ్యాయామాలివే.. పాటిస్తే హృదయ సంబంధ వ్యాధులకు చెక్ పెట్టినట్లే..!

Exercises For Heart Health: ప్రపంచ మానవాళిని వణికిస్తున్న ఆరోగ్య సమస్యలలో గుండె సమస్యలు ప్రథమ స్థానంలో ఉన్నాయి. కనీసం 30 సంవత్సరాలు కూడా నిండకుండానే ఎంతో మంది చనిపోతున్న దుర్ఘటనలను చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితిలో గుండెను సాధ్యమైనంత జాగ్రత్తగా కాపాడుకోవడం

Exercise for Heart: మీ చిన్ని గుండెను కాపాడే వ్యాయామాలివే.. పాటిస్తే హృదయ సంబంధ వ్యాధులకు చెక్ పెట్టినట్లే..!
Exercises For Heart Health
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 13, 2023 | 6:00 AM

Exercises For Heart Health: ప్రపంచ మానవాళిని వణికిస్తున్న ఆరోగ్య సమస్యలలో గుండె సమస్యలు ప్రథమ స్థానంలో ఉన్నాయి. కనీసం 30 సంవత్సరాలు కూడా నిండకుండానే ఎంతో మంది చనిపోతున్న దుర్ఘటనలను చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితిలో గుండెను సాధ్యమైనంత జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం తప్పనిసరి. కానీ గుండె ఆరోగ్యం కోసం ఇది మాత్రమే సరిపోదు.  సమతుల్య ఆహారంతో పాటు వ్యాయామం కూడా చేయాలి. అవును, గుండెను దృఢంగా మార్చడానికి వ్యాయామం ఉత్తమమైన మార్గం. వ్యాయామం చేయడం వల్ల హై బ్లడ్ షుగర్, హై కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రెజర్ వంటివి నియంత్రణలోకి రావడంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది. ఫలితంగా మీ గుండెకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మరి గుండె ఆరోగ్యం కోసం చేయవలసిన వ్యాయామాలు ఏమిటి..? వాటిని ఎలా చేయాలి.? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..

గుండెను ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచే వ్యాయామాలు

నడవడం: చాలా మంది తిని అలా పడుకుండిపోతుంటారు. అయితే అది మీ ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ముఖ్యంగా గుండెపై చెడు ప్రభావం చూపుతుంది. అందువల్ల భోజనం చేసిన 10 నిముషాల తర్వాత కాసేపు నడవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేగంగా నడవాలి.. అలా చేస్తే మీ హృదయం దృఢంగా మారుతుంది.

వర్కౌట్స్: శరీరంలో కండరాలను దృఢం చేయడంతో పాటు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా వర్కౌట్స్ సహాయపడతాయి. కొన్ని రకాల వర్కౌట్స్ చేయడం ద్వారా కండరాలను బలోపేతం కావడంతోపాటు.. కొవ్వు కూడా కరుగుతుంది. ఈ క్రమంలో మీరు పుష్-అప్స్, స్క్వాట్‌, పుల్-అప్‌లు చేయడం మంచిది.

ఇవి కూడా చదవండి

సైక్లింగ్: గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు రోజూ సైక్లింగ్ చేయడం ఇంకా మంచిది. సైక్లింగ్ గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇది కాలి కండరాలను బలపరుస్తుంది. దీంతో గుండె వేగం పెరగడంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా శ్రేయస్కరం.

స్విమ్మింగ్: ఈత గుండెకు చాలా మంచి వ్యాయామం. వాటర్ ఏరోబిక్స్ లేదా స్విమ్మింగ్ లాంటి వ్యాయామాలు శరీరంతోపాటు గుండెను కూడా దృఢంగా మారుస్తాయి. ఇతర వ్యాయామాలతో పోలిస్తే ఈత గుండెకు మంచి వ్యాయామం.

యోగా: యోగా చేయడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దీంతోపాటు కండరాలు దృఢంగా మారుతాయి. మీ హృదయ స్పందనను పెంచే అనేక యోగాసనాలు ఉన్నాయి. ఈ యోగాసనాలు వేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండవచ్చు. దీంతోపాటు రక్తపోటు కూడా తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఉత్తమమైన వ్యాయామం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..