Viral News: శునకాలు రక్తదానం చేస్తాయి తెలుసా.. వాటిలో ఎన్ని రకాల గ్రూపులంటే..
రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తాం. రక్తానికి ఉన్న డిమాండ్ ను బట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ప్రోత్సహిస్తాం. అయినా కొన్ని అపోహల కారణంగా ఇప్పటికి చాలామంది
Viral News: రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తాం. రక్తానికి ఉన్న డిమాండ్ ను బట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ప్రోత్సహిస్తాం. అయినా కొన్ని అపోహల కారణంగా ఇప్పటికి చాలామంది రక్తదానం అంటే భయపడిపోతాం. వామ్మో నాకు భయం అంటూ వెనక్కి వెళ్లిపోతాం. ఎన్నో స్వచ్ఛంధ సంస్థలు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక శిబిరాల ద్వారా రక్తదాన సేకరణ కోసం పనిచేస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. మనుషులు రక్తదానం చేయడం చూశాం. మరి జంతువులు కూడా రక్తదానం చేస్తే.. ఏమిటి జంతువులు రక్తదానం చేయడం ఏమిటనుకుంటున్నారా.. మనుషుల లాగే జంతువులకు రక్తం ఉంటుంది. జంతువులకు ఏదైనా శస్త్ర చికిత్సలు చేసేటప్పుడు బ్లడ్ అవసరం అవుతుంది. మరో విషయం ఏమంటే మనుషుల్లో ఏ పాజిటివ్, ఏబీ పాజిటివ్, ఓ పాజిటివ్, ఏ నెగిటివ్, ఓ నెగిటివ్.. ఇలా 35 రకాల వరకు బ్లడ్ గ్రూపులున్నాయి. మనుషుల్లో లాగే జంతువులకు బ్లడ్ గ్రూపులుంటాయి. కుక్కల్లో 13 వరకు బ్లడ్ గ్రూప్స్ ఉండగా.. గుర్రాల్లో 8, పిల్లుల్లో 3 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. కుక్కల్లో 1.1, 1.2, 3, 4, 5 ఇలా ఒక్కో జాతి శునకాన్ని బట్టి నెంబర్ల రూపంలో కుక్కల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. రక్తం ప్రవహించే ప్రతీ జంతువులోనూ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. జంతువులకు సంబంధించి రక్తదాన ప్రక్రియకు దాదాపు 30 నిమిషాల సమయం పడుతుంది. జంతువుల నుంచి రక్తం సేకరించేటప్పుడు వాటికి మత్తుమందు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనుషుల రక్తదాన సేకరణకు బ్లడ్ బ్యాంకులు ఎలా ఉన్నాయో.. జంతువుల రక్తదాన సేకరణకు బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఈబ్లడ్ బ్యాంకుల నిర్వహకులు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుంటారు. మరి జంతువుల నుంచి ఎంత రక్తం సేకరిస్తారనే అనుమానం రావచ్చు. జంతువుల ఆధారంగా ఈపరిమాణం ఆధారపడి ఉంటుంది.
కుక్కల నుంచి అయితే 450 ML, పిల్లుల నుంచి 53 ML రక్తాన్ని సేకరిస్తారు. ఇప్పుడు ఈజంతువుల రక్తదానం చర్చ ఎందుకు అనుకుంటున్నారా.. తాజాగా విశాఖపట్టణంలో కక్కులు రక్తదానం చేశాయి. ఈఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశాఖపట్టణంలో కుక్కలు రక్తదానం చేశాయి. పెంపుడు కుక్కల రక్తాన్ని వాటి యజమానులు ఆపదలో ఉన్న శునకాల కోసం దానం చేయించారు. విశాఖపట్టణంలోని పెద్దవాల్తేరులోని పావ్స్ ఎన్ టైల్స్ సంస్థ ఆగష్టు 28వ తేదీన నిర్వహించిన శునకాల రక్తదాన శిబిరంలో 10మంది శునకాల యజమానులు ముందుకొచ్చి రక్తం ఇప్పించారు. మనుషులలాగే కుక్కలకు రక్తం అవసరం అవుతుందని, ఏవైనా గాయాల కారణంగా.. ప్రాణపాయ స్థితిలో ఉన్న శునకాలకు అవసరమైనప్పుడు రక్తం ఎక్కించాల్సి వస్తుందని, కుక్కల నుంచి సేకరించిన రక్తాన్ని నిల్వ చేసి అవసరమైనప్పుడు ఉపయోగిస్తామని పశు వైద్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..