Vande Bharat Train Food: ‘వందేభారత్’ భోజనంలో బొద్దింకలు.. క్షమాపణలు చెబుతూ స్పందించిన ఐఆర్‌సీటీసీ..
రైలులోని ఆహారంలో కీటకాలు కనిపించడం ఇదే మొదటిసారి కాదని, ఇంతకుముందు కూడా ఇలాంటి అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రైల్వేలు అందించే ఆహార సేవపై ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తాయి. ఫిబ్రవరిలో కూడా వందేభారత్ రైలులో తనకు లభించిన ఆహారంలో చనిపోయిన బొద్దింక కనిపించడంతో ఒక వ్యక్తి ఇదే విధమైన ఫిర్యాదు చేశాడు. అంతకుముందు

ఐస్‌క్రీమ్‌లో ఇయర్‌విగ్‌లు, చిప్స్‌లో కప్పలు, ఫ్లైట్ ఫుడ్‌లో బ్లేడ్‌లు కనిపించిన తర్వాత ఇప్పుడు ట్రైన్ ఫుడ్‌లో బొద్దింక దొరికిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు భారతీయ రైల్వేల ప్రీమియం రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకుంది. అత్యాధునిక ‘వందేభారత్’ రైళ్లల్లోనూ ప్రయాణికులు ఇలాంటివి అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్నటికి మొన్న వందేభారత్ లో భారీ రద్దీకి సంబందించిన వీడియో వైరల్ కాగా, తాజాగా రైల్లో సర్వ్ చేసిన ఆహారంలో బొద్దింక కనిపించటం కలకలం రేపింది. వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగా వైరల్‌గా మారింది. వందే భారత్ రైలు ఆహారంలో బొద్దింక కనిపించిందని ఫిర్యాదు చేయడంతో, IRCTC క్షమాపణలు చెప్పింది. సర్వీస్ ప్రొవైడర్‌పై జరిమానా విధించాలని తెలిపింది.
భోపాల్ నుండి ఆగ్రా వెళ్తున్న రైలులో IRCTC ఇచ్చిన ఆహారంలో బొద్దింకలు కనిపించాయని ఒక జంట ఆరోపించింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో తన బంధువులకు ఇచ్చిన ఆహారంలో బొద్దింకలు కనిపించాయని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ Xలోని వినియోగదారు ఫిర్యాదు చేశారు. అతను తన ఫిర్యాదులో ఇలా వ్రాశాడు, ’18-06-24 న, మా మామ, అత్తమ్మ భోపాల్ నుండి ఆగ్రాకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. వారికి IRCTC ఇచ్చిన ఆహారంలో బొద్దింక కనిపించింది. దయచేసి విక్రేతపై కఠిన చర్యలు తీసుకోండి. ఇకపై ఇలా జరగకుండా చూసుకోండి. అతను తన పోస్ట్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే మంత్రిత్వ శాఖను కూడా ట్యాగ్ చేశాడు.
I was travelling on 1/02/2024 train no. 20173 RKMP to JBP (Vande Bharat Exp) I was traumatized by seeing dead COCKROACH in the food packet given by them.@narendramodi @AshwiniVaishnaw @drmjabalpur @wc_railway @Central_Railway @RailMinIndia @IRCTCofficial @fssaiindia @MOFPI_GOI pic.twitter.com/YILLixgLzj
— डाॅ. शुभेन्दु केशरी ⚕️👨⚕️ (@iamdrkeshari) February 2, 2024
ఇప్పుడు, పోస్ట్‌ను షేర్ చేసిన రెండు రోజుల తర్వాత, IRCTC క్షమాపణలు చెప్పింది. సర్వీస్ ప్రొవైడర్‌పై పెనాల్టీ విధించబడిందని తెలిపింది. IRCTC తన పోస్ట్‌లో, ‘సార్, మీ అనుభవానికి మేము క్షమాపణలు కోరుతున్నాము. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌కు తగిన జరిమానా విధించారు. మేము లాజిస్టిక్స్ పర్యవేక్షణను కూడా ముమ్మరం చేసాము. రైల్వే సర్వీస్ అధికారిక ట్విట్టర్ ఖాతా కూడా వివిడ్ పోస్ట్‌పై స్పందించింది.
రైలులోని ఆహారంలో కీటకాలు కనిపించడం ఇదే మొదటిసారి కాదని, ఇంతకుముందు కూడా ఇలాంటి అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రైల్వేలు అందించే ఆహార సేవపై ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తాయి. ఫిబ్రవరిలో కూడా వందేభారత్ రైలులో తనకు లభించిన ఆహారంలో చనిపోయిన బొద్దింక కనిపించడంతో ఒక వ్యక్తి ఇదే విధమైన ఫిర్యాదు చేశాడు. అంతకుముందు జనవరిలో కూడా ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న వందేభారత్ రైలులో ఆహారంపై ఫిర్యాదు వచ్చింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




