AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghost Marriage: మరణించిన జంటకు పెళ్లి చేసిన ఫ్యామిలీ.. హృదయాన్ని కదిలించే ప్రేమికుల స్టోరీ..

మలేషియాలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో యాంగ్ జింగ్షాన్, లి షుయింగ్ అనే జంట మరణించారు. ఈ సంఘటన మే 24న పెరాక్‌లోని వాయువ్య ప్రాంతంలో జరిగింది. వీరిద్దరూ గత మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. లీకి తనను పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేయడానికి జింగ్‌షాన్ తన పుట్టినరోజుని ఎంచుకున్నాడు. ఈ మేరకు బ్యాంకాక్‌కు వెళ్లాలని ప్లాన్ కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే దురదృష్టం ఈ జంటను వెంటాడింది

Ghost Marriage: మరణించిన జంటకు పెళ్లి చేసిన ఫ్యామిలీ.. హృదయాన్ని కదిలించే ప్రేమికుల స్టోరీ..
Ghost Marriage
Surya Kala
|

Updated on: Jun 20, 2024 | 6:35 PM

Share

చనిపోయిన వ్యక్తులకు పెళ్లి చేయడం అన్న సంప్రదాయం మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా జరిగిన సంఘటనతో కొన్ని దేశాల్లో కూడా మరణించిన వ్యక్తులకు కుటుంబ సభ్యులు పెళ్లి చేస్తారని తెలుస్తోంది. తాజాగా ప్రమాదంలో ఒకే సారి మరణించిన యువతీ యువకుడికి ఆ రెండు కుటుంబ సభ్యులు కలిసి ఆచార సాంప్రదాయాల ప్రకారం వివాహం చేశారు. ఈ ఘటన మలేషియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

మలేషియాలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో యాంగ్ జింగ్షాన్, లి షుయింగ్ అనే జంట మరణించారు. ఈ సంఘటన మే 24న పెరాక్‌లోని వాయువ్య ప్రాంతంలో జరిగింది. వీరిద్దరూ గత మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. లీకి తనను పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేయడానికి జింగ్‌షాన్ తన పుట్టినరోజుని ఎంచుకున్నాడు. ఈ మేరకు బ్యాంకాక్‌కు వెళ్లాలని ప్లాన్ కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే దురదృష్టం ఈ జంటను వెంటాడింది. అతను తన ప్రేమని వెల్లడించి పెళ్లి చేసుకోమని అడిగే లోపు కారు ప్రమాదంలో ఇద్దరూ మరణించారు. యాంగ్ జింగ్షాన్, లి షుయింగ్ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఇప్పుడు ఈ లోకంలో లేరు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఈ ప్రమాదం తర్వాత, రెండు ఇళ్లలోని కుటుంబాలు కలిసి ఒక ప్రత్యేకమైన ఆచారాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. తమ పిల్లల ఆఖరి కోరిక తీర్చేందుకు వారు ‘ప్రేత వివాహం’ నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

ఇది చైనాలో ఒక సంప్రదాయం. ఈ సంప్రదాయంలో ఇద్దరు పెళ్లికాని వ్యక్తులు చనిపోతే వారి ఆత్మలను వివాహం అనే పవిత్ర బంధంలో ఒకటి చేస్తారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన తర్వాత కూడా ఇద్దరూ భార్యాభర్తలుగా కలకాలం ఉంటారని.. వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్మకం.

జింగ్షాన్ , లీ కుటుంబాలు గత సోమవారం అంత్యక్రియల కోసం ఏర్పాటు చేసిన హాలులో ఈ ప్రత్యేకమైన వివాహ వేడుకను నిర్వహించాయి. ఇక్కడ మృతులైన యాంగ్ జింగ్షాన్, లి షుయింగ్ లకు వివాహం జరిపించారు. ఈ పెళ్లి వేడుక కోసం కుటుంబ సభ్యులు పెళ్లి ఫొటో కూడా తయారు చేశారు. జింగ్‌షాన్ కుటుంబం తమ సంతాప సందేశంలో లిని తమ కోడలుగా అంగీకరించింది.

మృతులకు పెళ్లి చేసే ఆచారం చైనాలోనే కాదు, ఈ దేశాల్లో కూడా ఉంది

చైనీస్ జానపద నిపుణుడు హువాంగ్ జింగ్‌చున్ మాట్లాడుతూ.. ఇలా మరణించిన వ్యక్తులకు పెళ్లి చేసే సాంప్రదాయం ప్రియమైన వారిని కోల్పోయిన బంధువుల భావోద్వేగాలను తీర్చడంలో సహాయపడుతుంది. చైనీస్ సంస్కృతి ప్రభావంతో ఉత్తర కొరియా , జపాన్ వంటి అనేక తూర్పు ఆసియా దేశాలలో కూడా ఇలా ఆత్మలకు వివాహ చేసే ఆచారం ప్రబలంగా ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!