AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలలో నా భార్య రక్తం తాగుతోంది..! పాపం, ఈ కానిస్టేబుల్‌ కథ వింటే షాక్ అవ్వాల్సిందే..!

తనకు, తన భార్యకు రాత్రిపూట గొడవలు జరుగుతాయని, దాని వల్లే తాను నిద్రపోలేకపోతున్నామని చెప్పాడు. తన భార్యతో తనకు తీవ్రమైన వాదన జరిగిందని, కలలో ఆమె తన ఛాతీపై కూర్చుని తనను చంపాలనే ఉద్దేశ్యంతో తన రక్తం తాగడానికి ప్రయత్నిస్తోందని అతను చెప్పాడు. రక్తం తాగే భార్య వల్లే తనకు నిద్రరావట్లేదని చెప్పాడు. దాని వల్ల తనకు నిద్రలేమి, ఆందోళన కలుగుతోందని, నిరాశకు గురవుతున్నానని..

కలలో నా భార్య రక్తం తాగుతోంది..! పాపం, ఈ కానిస్టేబుల్‌ కథ వింటే షాక్ అవ్వాల్సిందే..!
Wife Harassment
Jyothi Gadda
|

Updated on: Mar 06, 2025 | 2:07 PM

Share

డ్యూటీకి ఆలస్యంగా రావడానికి ఒక కానిస్టేబుల్ చెప్పిన కారణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భార్య రాత్రిపూట కలలో కనిపించడం వల్లే తాను సరిగ్గా నిద్రపోలేకపోతున్నానని, అందుకే పనికి ఆలస్యంగా వెళ్తున్నానని ఓ కానిస్టేబుల్ ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది. ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దర్యాప్తునకు ఆదేశించినట్లు 44వ బెటాలియన్ పిఎసి కమాండెంట్ సచింద్ర పటేల్ బుధవారం తెలిపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

యూపీకి చెందిన ఒక కానిస్టేబుల్ ప్రతిరోజూ డ్యూటీకి లేట్‌గా వస్తుండటంతో అతనిపై ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు బెటాలియన్‌ ఇన్‌చార్జ్‌ దల్నాయక్‌ మధుసూదన్‌ శర్మ వెల్లడించిన వివరాల మేరకు.. ఫిబ్రవరి 16న ఉదయం బ్రీఫింగ్‌కు కానిస్టేబుల్ ఆలస్యంగా వచ్చాడనీ, సరిగ్గా దుస్తులు ధరించలేదని, యూనిట్ కార్యకలాపాలకు తరచుగా హాజరు కాలేదని, ఇది తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణించబడిందని నోటీసులో ఆరోపించారు. దీనికి స్పందించిన కానిస్టేబుల్, ఎవరూ ఊహించని విధంగా స్పందించారు.

తనకు, తన భార్యకు రాత్రిపూట గొడవలు జరుగుతాయని, దాని వల్లే తాను నిద్రపోలేకపోతున్నామని చెప్పాడు. తన భార్యతో తనకు తీవ్రమైన వాదన జరిగిందని, కలలో ఆమె తన ఛాతీపై కూర్చుని తనను చంపాలనే ఉద్దేశ్యంతో తన రక్తం తాగడానికి ప్రయత్నిస్తోందని అతను చెప్పాడు. రక్తం తాగే భార్య వల్లే తనకు నిద్రరావట్లేదని చెప్పాడు. దాని వల్ల తనకు నిద్రలేమి, ఆందోళన కలుగుతోందని, నిరాశకు గురవుతున్నానని కానిస్టేబుల్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.. దీనికోసం తాను మందులు కూడా తీసుకుంటున్నానని వివరించాడు.

ఇవి కూడా చదవండి

అంతేకాదు.. తన తల్లి కూడా నరాల రుగ్మతతో బాధపడుతుందని, దీనివల్ల తన బాధ మరింత పెరిగిందని అతను చెప్పాడు. తనకు జీవించాలనే కోరిక పోయిందని, దేవుని పాదాల చెంతకు చేరిపోవాలని కోరుకుంటున్నాను అని భావోద్వేగంతో, విజ్ఞప్తితో కానిస్టేబుల్ తన ప్రతిస్పందనను తెలియజేశాడు. సోషల్ మీడియాలో లేఖ ప్రచురణపై దర్యాప్తు చేస్తున్నామని 44వ బెటాలియన్ PAC కమాండెంట్ సత్యేంద్ర పటేల్ తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..