Maha KumbhMela: మహా కుంభమేళాతో రూ. 30 కోట్లు సంపాదించిన కుటుంబం- సీఎం యోగి వెల్లడి
కుంభమేళా ద్వారా ఎంతోమంది ఆర్థికంగా లాభపడ్డారు. ఛాయ్, సమోసా, స్నాక్స్, పూజా సామాగ్రి, చివరకు కొందరు బ్రష్ చేసుకోవటానికి అవసరమైన వేపపుల్లలు కూడా విక్రయించారు. ఇలా రకరకాల వ్యాపారాల ద్వారా ప్రజలు డబ్బు సంపాదించారు. ఈ క్రమంలోనే ఓ కుటుంబం కుంభమేళ కాలంలో ఏకంగా రూ.30 కోట్లు సంపాదించిందట..ఇదేదో కట్టుకథ అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే.. ఈ విషయాన్ని స్వయంగా యూపీ సీఎం యోగా ఆదిత్యనాథ్ వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో అత్యంత వైభవంగా మహా కుంభమేళా ఉత్సవం జరిగింది. సంక్రాంతితో మొదలైన ఈ ఘట్టం శివరాత్రికి ముగిసింది. ప్రపంచం నలుమూలల నుంచి పేద, ధనిక అనే తేడా లేకుండా కోట్లాది మంది భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగిన ఈ కుంభమేళా ద్వారా ఎంతోమంది ఆర్థికంగా లాభపడ్డారు. ఛాయ్, సమోసా, స్నాక్స్, పూజా సామాగ్రి, చివరకు కొందరు బ్రష్ చేసుకోవటానికి అవసరమైన వేపపుల్లలు కూడా విక్రయించారు. ఇలా రకరకాల వ్యాపారాల ద్వారా ప్రజలు డబ్బు సంపాదించారు. ఈ క్రమంలోనే ఓ కుటుంబం కుంభమేళ కాలంలో ఏకంగా రూ.30 కోట్లు సంపాదించిందట..ఇదేదో కట్టుకథ అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే.. ఈ విషయాన్ని స్వయంగా యూపీ సీఎం యోగా ఆదిత్యనాథ్ వెల్లడించారు.
మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో పడవలు నడిపేవారు దోపిడీకి గురయ్యారని సమాజ్‌వాదీ పార్టీ చేసిన ఆరోపణలపై సీఎం యోగి స్పందించారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా యోగి మాట్లాడుతూ.. ఓ కుటుంబానికి 130 పడవలు ఉన్నాయని ఒక్కో పడవతో రోజుకు గరిష్ఠంగా రూ. 52 వేల వరకు సంపాదించారని తెలిపారు. అంటే 45 రోజుల్లో ఒక్కో పడవతో రూ. 23 లక్షల చొప్పున సంపాదించారని చెప్పారు. మొత్తంగా 130 పడవలతో రూ.30 కోట్ల వరకు ఆర్జించినట్టు సీఎం యోగి వివరించారు.
45 రోజుల పాటు సాగిన ఈ మహా కుంభమేళాను ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా నిర్విహించామని సీఎం యోగి స్పష్టం చేశారు. 45 రోజుల్లో ఒక్క నేరం కూడా జరగలేదన్నారు. కుంభమేళా నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 7,500 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. దాదాపు రూ. 3 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




