Viral: రూమ్‌లోకి రమ్మన్న వదిన.. గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిన మరిది.. సీన్ కట్ చేస్తే.!
బావమరిదిని తన రూమ్ లోకి రమ్మని చెప్పింది వదిన. ఏ విషయం పై పిలిచిందోనని తెలుసుకునేందుకు దీపావళి జరుపుకుని.. ఆ తర్వాత వెళ్లాడు. అంతే.! కాసేపటికే అరుపులతో కేకలు వేశాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి.

ఆగ్రాలోని బర్హాన్ ప్రాంతంలో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. తన చెల్లితో పెళ్లి వద్దన్నాడన్న కోపంతో బావమరిది ప్రైవేట్ పార్టును కోసేసింది సదరు మహిళ. బాధితుడిని యోగేష్‌గా గుర్తించారు. హుటాహుటిన అతడ్ని ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో.. మెరుగైన చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు.
వివరాల్లోకి వెళ్తే.. స్థానిక హల్ద్వానీలోని అల్ట్రాటెక్ కంపెనీలో పనిచేస్తున్న ఇంజనీర్ యోగేష్ దీపావళి సెలవులకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో అతడి వదిన అర్చన తన చెల్లిని వివాహం చేసుకోవాలని యోగేష్‌ను కోరింది. అయితే అందుకు యోగేష్ నో చెప్పగా.. తన వివాహాన్ని కుటుంబ సభ్యులు నిశ్చయించారని చెప్పుకొచ్చాడు. నవంబర్‌లో అది జరుగుతుందని స్పష్టం చేశాడు. దీంతో కోపం తెచ్చుకున్న ఆమె.. దీపావళి తర్వాత తన గదిలోకి యోగేష్‌ను పిలిచి.. కత్తితో ప్రైవేట్ పార్టుపై దాడి చేసింది.
కాగా, యోగేష్ అరుపులు విన్న కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వచ్చి చూడగా తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తర్వాత అర్చనను ఆమె భర్త పుట్టింటికి పంపించేశాడు. కాగా, కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు బర్హాన్ పోలీసులు. దీనిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన అక్టోబర్ 16న చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
आगरा भाभी ने काटा देवर का प्राइवेट पार्ट,
प्राइवेट पार्ट कटने से युवक की हालत गंभीर,
दीपावली की छुट्टी पर घर आया था देवर,
नाराज होकर भाभी ने काटा देवर प्राइवेट पार्ट,
गंभीर हालत को देखते हुए देवर को इलाज के लिए ले जाया गया दिल्ली, @agrapolice @Uppolice #agra pic.twitter.com/9s448ra8bV
— Uttam UP (@_Uttam_Up) October 21, 2025
