Viral Video: రష్యా యుద్ధ ట్యాంక్‌ని దొంగిలించిన రైతు! ఆపండ్రోయ్ అంటూ పరుగెత్తిన సైనికులు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరంతే..!
Viral Video: రష్యా - ఉక్రెయిన్ మధ్య భీకర పోరు సాగుతోంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేస్థాయిలో భవన సముదాయాలు నేలకూలుతున్నాయి.

Viral Video: రష్యా – ఉక్రెయిన్ మధ్య భీకర పోరు సాగుతోంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేస్థాయిలో భవన సముదాయాలు నేలకూలుతున్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారు. ఇప్పటి వరకు క్షిపణులు, యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకుల ద్వారానే కొనసాగిన యుద్ధం.. ఇప్పుడు మరింత తీవ్రరూపం దాల్చింది. రష్యా అధినేత పుతిన్ ఏకంగా అను ఆయుధాల ప్రయోగంపై దృష్టి పెట్టి యావత్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్నారు. రష్యా దెబ్బకు ఉక్రెయిన్ అతలాకుతలం అవుతోంది. అక్కడ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. అయితే, రష్యాపై పోరుకు ఉక్రెయిన్ పౌర సమాజం సైతం కదిలింది. దేశం కోసం తాము సైతం అంటూ సాధారణ ప్రజలు సైతం ముందుకు వస్తున్నారు. రష్యా సైనికులను మట్టుబెట్టేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. అయితే, ఇంత సీరియస్ యుద్ధం జరుగుతుండగా.. ఓ సన్నివేశం మాత్రం యావత్ ప్రపంచానికి కాస్త నవ్వులు తెప్పించింది.
అవును.. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై నాలుగు రోజులు అవుతోంది. ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే, రష్యా సైనిక చర్యపై ఉక్రెయిన్ పౌరులు సైతం ఎదురుతిరుగుతున్నారు. తాజాగా, ఉక్రెయిన్‌కు చెందిన ఓ సాధారణ రైతు.. వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్ సాయంతో యుద్ధ ట్యాంకర్‌ను లాక్కెళుతున్నాడు. ట్యాంకర్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు రష్యాకు చెందిన సైనికుడు ఆ ట్రాక్టర్ వెంట పరుగెత్తడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సన్నివేశాన్ని కొందరు తమ ఫోన్ కెమెరాలలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ ఫన్నీ వీడియోను ఆస్ట్రియాలోని ఉక్రెయిన్ రాయబారి అలెగ్జాండర్ షెర్బా తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ‘‘ఈ వీడియో నిజమైతే.. ఇది ఖచ్చితంగా రైతు దొంగిలించిన మొదటి ట్యాంక్ అవుతుంది. ఇదంతా చూస్తుంటే ఉక్రేనియన్లు నిజంగా చాలా బలంగా ఉన్నారని అనిపిస్తుంది.’’ అంటూ క్యాప్షన్ పెట్టారు. కాగా, ఈ వీడియోపై నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇది నిజమో అబద్ధమో తెలియదు కానీ, చాలా ఫన్నీ ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. యుద్ధం ప్రారంభమైన తరువాత తొలిసారి ఈ వీడియో చూసి నవ్వుకున్నాను అని మరొకరు కామెంట్ పెట్టారు.
If true, it’s probably the first tank ever stolen by a farmer… )) Ukrainians are tough cookies indeed. #StandWithUkraine #russiagohome pic.twitter.com/TY0sigffaM
— olexander scherba?? (@olex_scherba) February 27, 2022
Also read:
Big News Big Debate: అణ్వస్త్రాలను రష్యా మోహరించిందా? పుతిన్ ప్రకటనలు కీడు శంకిస్తున్నాయా?
Shocking: తన భర్తను వలలో వేసుకుందని యువతిపై మహిళ ఆగ్రహం.. గుప్పిట కారం తీసుకుని ఏం చేసిందంటే..
Kajal Viral Video: తగ్గేదేలే అంటున్న అందాల చందమామ.. గర్భవతి అయినప్పటికీ.. వైరల్ వీడియో..!
