Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్లు.. రూ.100తో ఎన్ని కోట్ల జాక్‌పాట్ కొట్టారో తెలిస్తే షాకే!

లచ్చిందేవి... ఎప్పుడు.. ఎలా.. ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. అందుకేనేమో కొన్నిసార్లు సామాన్యులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతుంటారు.

Viral: అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్లు.. రూ.100తో ఎన్ని కోట్ల జాక్‌పాట్ కొట్టారో తెలిస్తే షాకే!
Money
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 01, 2022 | 5:16 PM

దురదృష్టం తలుపు తీసేదాకా తడుతూనే ఉంటది.. కానీ అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది. లచ్చిందేవి… ఎప్పుడు.. ఎలా.. ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. అందుకేనేమో కొన్నిసార్లు సామాన్యులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతుంటారు. తాజాగా అలాంటి ఓ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన ప్రదీప్, రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు కొద్దిరోజుల క్రితం విదేశాల నుంచి వచ్చిన తన బంధువును రిసీవ్ చేసుకునేందుకు కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్లారు. ఆ సమయంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు విషు బంపర్ లాటరీ టికెట్ ఒకటి కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన లక్కీ డ్రా.. మే 15వ తేదీన తీయగా.. ఆ ఇద్దరికి ఊహించని రీతిలో జాక్‌పాట్ తగిలింది. రూ.100 లాటరీ టికెట్‌కు రూ.10 కోట్ల లాటరీ తగిలింది. కాగా, వీరిద్దరూ ఆ లాటరీ డబ్బును అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి తీసుకున్నారు.