Viral: అడవిలో నుంచి కట్టెలు తెస్తుండగా.. మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటా అని చూడగా కళ్లు జిగేల్!

ఆమె ఓ గిరిజన మహిళ.. ప్రతీసారి కట్టెలు కోసం అడవికి వెళ్తుంది. ఈ క్రమంలోనే ఓ రోజు అడవికి కట్టెల కోసం వెళ్లగా..

Viral: అడవిలో నుంచి కట్టెలు తెస్తుండగా.. మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటా అని చూడగా కళ్లు జిగేల్!
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 28, 2022 | 1:21 PM

ఆమె ఓ గిరిజన మహిళ.. ప్రతీసారి కట్టెలు కోసం అడవికి వెళ్తుంది. ఈ క్రమంలోనే ఓ రోజు అడవికి కట్టెల కోసం వెళ్లగా.. వాటిని తీసుకుని.. తిరిగి వస్తుండగా.. మార్గం మధ్యలో మెరుస్తున్న వస్తువు ఒకటి కనిపించింది. ఏంటా అని దగ్గరకెళ్లి చూడగా ఆమె కళ్లు ఒక్కసారిగా జిగేలుమన్నాయి. ఇంతకీ ఆ కథేంటంటే.!

వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని పెన్నా జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళ ఇటీవల అడవిలో కట్టెలు కొట్టేందుకు వెళ్లింది. కొట్టిన కట్టెలను తిరిగి ఇంటికి తెస్తుండగా.. మార్గం మధ్యలో ఆమెకు ఓ వస్తువు మెరుస్తూ కనిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా అదొక చిన్న రాయి. సదరు మహిళ దాన్ని తీసుకుని ఇంటి చేరుకుంది.. ఆ ప్రకాశవంతమైన రాయిని తన భర్తకు చూపించింది. ఆ రాయిని అతడు స్థానికంగా ఉండే వజ్రాల వ్యాపారి దగ్గరకు తీసుకెళ్లి చెక్ చేయగా.. అది విలువైన వజ్రం అని తేలింది. దాని బరువు 4 క్యారెట్ల 39 సెంట్లు ఉంటుంది. అలాగే దీని మార్కెట్ విలువ సుమారు రూ. 20 లక్షలు ఉంటుందని అంచనా. త్వరలో జరగబోయే వజ్రాల వేలంలో ఈ అరుదైన వజ్రాన్ని ఉంచనున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి
Diamond

 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..