Viral Video: వలకు చిక్కిన తోడేలు చేప.. ఎంత భయంకరంగా ఉందో చూడండి.!

సముద్రం చాలా గొప్పది.. చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది.. ఈ డైలాగ్‌ మహా సముద్రం సినిమాలోనిదే అయినా..

Viral Video: వలకు చిక్కిన తోడేలు చేప.. ఎంత భయంకరంగా ఉందో చూడండి.!
Fish
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 28, 2022 | 1:32 PM

సముద్రం చాలా గొప్పది.. చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది.. ఈ డైలాగ్‌ మహా సముద్రం సినిమాలోనిదే అయినా.. సముద్రంలో కొన్ని వింత జీవాలను చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది. సముద్రాల్లో రకరకాల చేపలతో పాటు భయంకరమైన జీవాలు కూడా ఉంటాయి. అయితే తాజాగా ఓ భయంకరమైన చేప ఓ మత్స్యకారుడి వలకు చిక్కింది. అదే తోడేలు చేప. అవును మీరు విన్నది నిజమే.! ఈ చేప చూసేందుకు అచ్చం తోడేలు రూపంలో ఉంది.

భయంకరమైన ఆకారంతో రాకాసిలా.. పెద్దగా నోరు తెరుచుకుని ఉంది ఈ తోడేలు చేప. అయితే ఇలాంటి చేపలను తోడేలు చేపలని అంటారని, నీళ్లు లేకున్న బురదలో కూడా ఇది జీవించగలదని తెలిపాడు మత్స్యాకారుడు. అయితే చేతిలో పట్టుకున్న ఈ చేప మత్స్యకారుడి చేతిని కొరికేందుకు పలు సార్లు ప్రయత్నించింది. కానీ అతడు చాకచక్యంగా దానిని పట్టుకుని ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. అయితే ఇలాంటి చేపలు దొరికినప్పుడు తాము మళ్లీ వాటిని సముద్రంలోనే వదిలేస్తామని తెలిపాడు. ఈ ఘటనలో అమెరికాలో చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Jacob Knowles (@jknowles831)

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..