AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మామిడి పండు కోసం ఆశపడితే.. ఒళ్లంతా వాతలే! చూస్తే నవ్వు ఆపుకోలేరు!

"దురాశ దు:ఖానికి చేటు" అన్నారు పెద్దలు. ఏ విషయమైనా హద్దులు దాటితే ప్రమాదమే.. ముఖ్యంగా దురాశకు పోతే ఎలాంటి పరాభవం ఎదురవుతుందో చెప్పడానికి సరిగ్గా సరిపోయే ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరు.

Viral Video: మామిడి పండు కోసం ఆశపడితే.. ఒళ్లంతా వాతలే! చూస్తే నవ్వు ఆపుకోలేరు!
Attempt To Steal A Mango
Balaraju Goud
|

Updated on: Jun 04, 2026 | 5:55 PM

Share

“దురాశ దు:ఖానికి చేటు” అన్నారు పెద్దలు. ఏ విషయమైనా హద్దులు దాటితే ప్రమాదమే.. ముఖ్యంగా దురాశకు పోతే ఎలాంటి పరాభవం ఎదురవుతుందో చెప్పడానికి సరిగ్గా సరిపోయే ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరు.

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో.. ఒక మామిడి తోట పక్కన రైలు ఆగి ఉండటం కనిపించింది. రైలులో కూర్చున్న ఒక ప్రయాణికుడు కిటికీలోంచి పక్కనే ఉన్న తోటలోని మామిడి పండ్లను చూశాడు. చెట్లకు నిండుగా ఊగుతున్న ఆ పండ్లను చూడగానే అతని నోరూరింది. రైలు ఎలాగో ఆగిందే కదా.. త్వరత్వరగా వెళ్లి ఒక రెండు కాయలు కోసుకుని వచ్చేద్దామని ప్లాన్ వేసి, చటుక్కున రైలు దిగి తోటలోకి దూరాడు. అనుకున్నట్లే రెండు పండ్లు కోశాడు కానీ, అక్కడే సీన్ రివర్స్ అయింది.

అతను పండ్లు కోయడం పూర్తయ్యేలోపే ఆగి ఉన్న రైలు నెమ్మదిగా కదలడం మొదలైంది. దాంతో ఆ ప్రయాణికుడి గుండె గుభేల్ మంది. చేతిలో మామిడి పండ్లను పట్టుకుని రైలు వైపు లబోదిబోమంటూ పరిగెత్తడం ప్రారంభించాడు. అయితే అతని కష్టాలు అక్కడితో తీరలేదు. ఆ తోటను కాపలా కాస్తున్న గార్డు ఈ దొంగతనాన్ని గమనించాడు. అంతే.. కోపంతో ఊగిపోతూ చేతిలో లావుపాటి కర్ర పట్టుకుని ఆ ప్రయాణికుడి వెనుక ఉరుకులు పెట్టాడు.

ఇప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ లాగా తయారైంది. ఒకవైపు వేగం పుంజుకుంటున్న రైలు.. మరోవైపు వెనుక నుంచి యముడిలా వస్తున్న గార్డు. ఎలాగోలా ప్రాణాలు నరకంలో పెట్టుకుని రైలు తలుపును పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, అంతలోనే వెనుక నుంచి వచ్చిన గార్డు.. ఏమాత్రం దయలేకుండా ఆ ప్రయాణికుడి వెనుక భాగంలో కర్రతో గట్టిగా వాయించడం మొదలుపెట్టాడు.

ఆ దెబ్బలు తట్టుకోలేక ప్రయాణికుడి చేతిలోని మామిడి పండ్లు కింద పడిపోయాయి. ఎలాగోలా ప్రాణాలు దక్కించుకుని, దెబ్బలు తింటూనే రైలు పెట్టెలోకి దూరాడు. చివరికి చేతికి మామిడి పండు అందలేదు సరే కదా.. ఒళ్లంతా దెబ్బలు, అందరి ముందు ఘోర అవమానం మిగిలింది. జూన్ 2న రితేష్ కుష్వాహా అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. దీనికి ఇప్పటికే 5 లక్షలకు పైగా లైకులు, లక్షలాది వ్యూస్ వచ్చాయి. “రూ. 20 మామిడి పండు కోసం ఆశపడితే.. రూ. 50 ఐయోడెక్స్ ఖర్చయింది” అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

ఫన్నీ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా