Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏనుగుపై అడవిలో వెళ్తున్న అధికారి.. చూస్తుండగానే దాడిచేసిన పెద్ద పులి.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో

పెంపుడు జంతువులు, మనుషులపై పులులు చేసే దాడులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఒళ్లు గగ్గుర్పాటుకు గురికాకతప్పదు.

ఏనుగుపై అడవిలో వెళ్తున్న అధికారి.. చూస్తుండగానే దాడిచేసిన పెద్ద పులి.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో
Tiger Attack
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 31, 2022 | 11:22 AM

ఒకప్పుడు వన్యప్రాణులు అడవుల్లో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు అడవులు అంతంతమాత్రంగా మారాయి. దాంతో అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనావాసాల్లోకి వచ్చి భయపెడుతున్నాయి. అడవి జంతువుల భయంతో మనుషులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి నెలకొంది. ఎందుకంటే అడవి జంతువులు ఎప్పుడు, ఎటు నుంచి, ఎవరిపై దాడి చేస్తాయోననే భయం ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. సింహాలు తక్కువేగానీ, పులులు, చిరుతలు తరచుగా మానవ నివాసాలలో కనిపిస్తున్నాయి. పెంపుడు జంతువులు, మనుషులపై అవి చేసే దాడులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఒళ్లు గగ్గుర్పాటుకు గురికాకతప్పదు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో, పులి ఒక వ్యక్తిపై దాడి చేస్తుంది. ఆ వ్యక్తి ఏనుగుపై స్వారీ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా పులి అతనిపై దాడి చేసింది. సాధారణంగా పులులు, సింహాలు ఏనుగులపై స్వారీ చేస్తున్న మనుషులపై దాడి చేయవు. కానీ, ఇక్కడ జరిగింది మాత్రం పూర్తి విరుద్ధంగా..పులి ఏనుగుకు ఏమాత్రం భయపడకుండా ఏనుగుపై ఎక్కి తిరుగుతున్న వ్యక్తిపై ఏమాత్రం ఆలోచించకుండా దాడి చేసింది.

ఇవి కూడా చదవండి

ముందుగా, ఆ వ్యక్తి ఏనుగుపై ఎలాంటి భయం లేకుండా హాయిగా స్వారీ చేస్తున్నట్టుగా వీడియోలో కనిపిస్తుంది. అయితే ఇంతలోనే, ఒక పులి పొలాల మధ్య నుండి పరుగెత్తుకుంటూ వచ్చి లాంగ్ జంప్‌తో అతడిపై దాడి చేసింది. ఆ తర్వాత సదరు వ్యక్తికి ఏం జరిగిందన్న విషయం తెలియరాలేదు. వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. పులి దాడికి సంబంధించిన ఈ హృదయ విదారక వీడియోను చూడండి.

ఈ షాకింగ్‌ వీడియో @weirdterrifying అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. కేవలం 13 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 3.6 మిలియన్ సార్లు వీక్షించగా, 49 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి