Viral Video: రంగు మార్చుకునే నది.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారంటే.. వైరల్ వీడియో.!
ప్రకృతిలో జరిగే కొన్ని వింతలు చూసేందుకు భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మొదటిసారిగా వాటి గురించి విన్నప్పుడు కొంచెం...
ప్రకృతిలో జరిగే కొన్ని వింతలు చూసేందుకు భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మొదటిసారిగా వాటి గురించి విన్నప్పుడు కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా.. చూస్తే మాత్రం ఫిదా అయిపోవాల్సిందే. ఇలాంటి ఆశ్చర్యకరమైన అద్భుతాల్లో ఒకటి రంగును మార్చుకునే నది. ఈ నది పేరు కానో క్రిస్టల్స్(Cano Crystals), ఇది కొలంబియాలో ప్రవహిస్తోంది. దీని ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటే.. ఈ నది ప్రతీ సీజన్‌లోనూ తన రంగును మార్చుకుంటుంది. దీనిని రివర్ ఆఫ్ 5 కలర్స్ లేదా లిక్విడ్ రెయిన్‌బో అని కూడా పిలుస్తుంటారు.
100 కిలోమీటర్ల పొడవు కానో క్రిస్టల్…
కొలంబియాలోని సెరానియా డిలా మాకరేనా నేషనల్ పార్క్‌లో కానో క్రిస్టల్స్ నది ప్రవహిస్తోంది. నది 100 కిమీ కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ నది నీళ్లు జూన్ నుండి నవంబర్ మధ్యకాలంలో కొన్నిసార్లు పసుపు, కొన్నిసార్లు నీలం, కొన్నిసార్లు ఆకుపచ్చ, కొన్నిసార్లు ఎరుపు, కొన్నిసార్లు నలుపుగా మారతాయి. ఈ నదిలోని క్రిస్టల్స్ నీటి అడుగున ఉపరితలాలకు అతుక్కోవడం వల్ల.. దానిలోని నీళ్లు వివిధ రంగుల్లోకి మారుతాయి. ఈ నదిని చూసేందుకు రోజుకు 200 మంది పర్యాటకులకు మాత్రమే అనుమతి ఉంది. నది చుట్టుప్రక్కల పరిసరాల్లో కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో కానో క్రిస్టల్స్ నదిని చూసేందుకు పర్యాటకులను అనుమతించలేదు.
నేషనల్ పార్క్ ప్రొటెక్ట్‌డ్ ఏరియా..
కొలంబియాలోని సెరానియా డి లా మాకరేనా నేషనల్ పార్క్ అత్యంత హైసెక్యూరిటీ కలిగిన ప్రాంతం. ఈ పార్క్ చుట్టూ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, ఆండీస్ రేంజ్, ఈస్టర్న్ లానోస్ లష్ సవన్నా ప్రాంతాలు ఉన్నాయి. ప్రపంచంలోని అసాధారణ వృక్షజాలం, జంతువులు ఈ ప్రదేశంలో కనిపిస్తాయి. ఈ పార్కులో 2,000 మొక్కలు, 500 జాతుల పక్షులు, 1,200 కీటకాలు, 100 సరీసృపాలు, ఎనిమిది జాతుల కోతులు అనేక ఇతర జంతువులు ఇప్పుడు అంతరించిపోయే దశలో ఉన్నాయి.
Also Read:
మొసలికి చిక్కిన అడవి దున్న.. కట్ చేస్తే సీన్ రివెర్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
బ్రతుకున్న పామును కరకరా నమిలి మింగేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకే.!
10 వేలకుపైగా పరుగులు, 1697 వికెట్లు.. ఈ దిగ్గజ క్రికెటర్ మామూలోడు కాదు.. అతడెవరో తెలుసా!