Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bahubali Pani Puri: బాహుబలి పానీ పూరి.. ఎలా తయారు చేస్తారో తెలుసా.. ట్రెండింగ్‎లో ఉన్న వీడియో..

పానీ పూరి అంటే ఎవరికైనా ఇష్టమే.. ముఖ్యంగా అమ్మాయిలకు చాలా ఇష్టం. రోడ్డుపై పానీ పూరి బండి కనిపించగానే అటువైపు చూస్తూనే ఉంటారు. అంత పవర్ ఉంది పానీ పూరికి...

Bahubali Pani Puri: బాహుబలి పానీ పూరి.. ఎలా తయారు చేస్తారో తెలుసా.. ట్రెండింగ్‎లో ఉన్న వీడియో..
Panipuri
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 06, 2021 | 9:26 PM

పానీ పూరి అంటే ఎవరికైనా ఇష్టమే.. ముఖ్యంగా అమ్మాయిలకు చాలా ఇష్టం. రోడ్డుపై పానీ పూరి బండి కనిపించగానే అటువైపు చూస్తూనే ఉంటారు. అంత పవర్ ఉంది పానీ పూరికి. ఇదీ దాదాపు భారత దేశం అంతట ప్రచుర్యంపొందింది. ఇటీవల భోపాల్ వీధి ఫుడ్ విక్రేత తన కుమార్తె జన్మదినాన్ని పురస్కరించుకుని తన వినియోగదారులందరికీ ఉచితంగా పానీ పూరి అందించినప్పుడు పానీ పూరి వార్తల్లో నిలిచింది. తాజాగా మరో ప్రత్యేకమైన పానీ పూరి అందరని ఆకర్షించింది. అదే “బాహుబలి పానీ పూరి”. ఈ పానీ పూరి చాట్ ప్రేమికులను మంత్రముగ్ధులను చేసింది.

ప్రముఖ ఫుడ్ బ్లాగర్ లక్ష్ దద్వానీ యూట్యూబ్‎లో బాహుబలి పానీ పూరి వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోగా31 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దేశంలోని ట్రెండింగ్ వీడియోల్లో ఇది ఒకటిగా నిలించింది. నాగపూర్‎లోని ప్రతాప్ నగర్‌ వీధి ఆహార విక్రేత చిరాగ్ కా చస్కా పానీ పూరి వెరైటీలు చేసి అనేకసార్లు వార్తల్లో నిలిచాడు. అతను తాజాగా బాహుబలి పానీ పూరి తయారు చేసి అందరిని ఆకర్షించాడు. పెద్ద పానీ పూరి తీసుకుని అందులో రకరకాల చట్నీలు, పానీతో నింపుతాడు. ఇమ్లీ చట్నీ, రెగ్యులర్ పానీ, సీజనల్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ పానీ, జీరా (జీలకర్ర) పానీ, వెల్లుల్లి పానీ పానీ పూరీ లోపల నింపి.. దానిపై బంగాళాదుంప కూరను స్తూపాకరంగా నింపుతాడు. చివరగా పెరుగు, బూందీ, సేవ్, దానిమ్మపండుతో నింపి బాహుబలి పానీ పూరి తయారు చేస్తాడు. ఆసక్తికరమైన బాహుబలి పానీ పూరీ చాలా రుచికరంగా ఉన్నప్పటికీ తినడానికి ఇబ్బందిగా ఉంది. “దీన్ని ఎలా తినాలో మీరు వీడియో కూడా చేయాలి” అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. “ఈ ప్రపంచంలో ఒకే బుక్కలో తినలేని పానీ పూరీ ఉందని నమ్మలేకపోతున్నాను!” అని మరొకరు అన్నారు.

Read Also.. Guinness Record: చెన్నై కుర్రాడి సాహసం.. రెండు చక్రాలతో ఆటో నడిపాడు.. రికార్డు సృష్టించాడు..

18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!