Guinness Record: చెన్నై కుర్రాడి సాహసం.. రెండు చక్రాలతో ఆటో నడిపాడు.. రికార్డు సృష్టించాడు..

ఓ ఆటో డ్రైవర్ ఆటోను రెండు చక్రాలతో నడిపి రికార్డు సృష్టించాడు. ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది. ఈ వీడియోనే కాకుండా..

Guinness Record: చెన్నై కుర్రాడి సాహసం.. రెండు చక్రాలతో ఆటో నడిపాడు.. రికార్డు సృష్టించాడు..
Auto
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 06, 2021 | 7:27 PM

ఓ ఆటో డ్రైవర్ ఆటోను రెండు చక్రాలతో నడిపి రికార్డు సృష్టించాడు. ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది. ఈ వీడియోనే కాకుండా ప్రపంచ రికార్డులకు సంబంధించి పలు వీడియోలు, చిత్రాలను ప్రజలతో పంచుకుంది. తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన ఆటో డ్రైవర్ జగతీష్ తన ఆటోను రెండు చక్రాలతో 2.2 కిలోమీటర్లు నడిపారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

జగతీష్ తన స్టీరింగ్ ఉపయోగించి మూడు చక్రాల వాహనాలను రెండు చక్రాలతో నడిపాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధిస్తానని తను అనుకోలేదని జగతీష్ అన్నారు. చాలా ఆనందంగా ఉందని చెప్పారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (జీడబ్ల్యూఆర్) నియమం ప్రకారం కేవలం ఒక కిలోమీటరు దూరం వరకు రెండు చక్రాలపై నడిపితే రికార్డు సృష్టించినట్లే.. కానీ జగతీష్ తన మూడు చక్రాల వాహనాన్ని రెండు చక్రాలపై 2.2 కిలోమీటర్ల దూరం నడిపి రికార్డు సృష్టించాడు.

ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి 316,570 మంది చూశారు. జగతీష్ ప్రతిభను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇదీ నిజమేనా.. తమను తాము నమ్మలేకపోతున్నామని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. “సినిమాలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు… భారతీయ సినిమాలు నకిలీవని ఎవరు చెప్పారు?” అని మరొక నెటిజన్ రాసుకొచ్చారు. మరొకరు జగతీష్‎ను”ఇండియన్ ఆటో పైలట్” అని వ్యాఖ్యానించారు.

Read Also.. FacebooK: ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్‎కు పెద్ద షాక్.. టెలిగ్రామ్‎కు మారిన 70 మిలియన్ల మంది..